Pahalgam Briefing: పహల్గాం దారుణం మిత్ర దేశాల దృష్టికి
ABN , Publish Date - Apr 25 , 2025 | 03:00 AM
పహల్గాం ఉగ్రదాడి గురించి జీ-20 దేశాల రాయబారులకు భారత్ వివరించగా, సీమాంతర ఉగ్రవాదంపై గట్టిగా స్పందించనున్నట్టు విదేశాంగ కార్యదర్శి తెలిపారు. సింధు ఒప్పంద రద్దు, అత్తారీ మూసివేతల తర్వాత ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది

జీ-20 రాయబారులకు వివరించిన విదేశాంగ కార్యదర్శి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దారుణాన్ని భారత్ మిత్ర దేశాలకు వివరించింది. విదేశీవ్యవహారాల కార్యదర్శి విక్రం మిస్రి జీ-20 కూటమిలోని దేశాల రాయబారులకు ఈ దాడికి సంబంఽధించిన సమాచారాన్ని వివరించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ దాడికి, సీమాంతర ఉగ్రవాదంతో ఉన్న సంబంధాన్ని వారి దృష్టికి తీసుకొచ్చారు. ఉగ్రవాదాన్ని క్షమించబోమన్న విధానాన్ని అనుసరిస్తున్నట్టు చెప్పారు. పాకిస్థాన్‌తో 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు, అత్తారీ సరిహద్దును మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన మరుసటి రోజునే రాయబారులతో మిస్రి భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది. ఈ భేటీలో జీ-20 కూటమిలోని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, రష్యా. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, చైనా దేశాల రాయబారులు హాజరయ్యారు. వారితో పాటుగా వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్, మలేసియా దేశాల రాయబారులు కూడా పాల్గొన్నారు. మిత్రదేశాలతో భేటీ అయిన విదేశీ వ్యవహారాల కార్యదర్శి వాస్తవ పరిస్థితులను, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
ఇవి కూడా చదవండి
Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..
Fauji Actress Imanvi: పుకార్లపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్