India Bloc Virutal meet: పార్లమెంటులో అమీతుమీ.. ఇండియా కూటమి వర్చువల్ మీట్
ABN , Publish Date - Jul 19 , 2025 | 09:33 PM
జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కాంగ్రెస్ పట్టుబట్టనుంది. మహిళలపై పెరుగుతున్న నేరాలు, అహ్మదాబాద్ విమానం ప్రమాదం, పెరుగుతున్న నిరుద్యోగం, రైతుల కష్టాలు వంటి అంశాలను కూడా పార్లమెంటులో ప్రస్తావించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అధికార పక్షంతో అమీతుమీకి ఇండియా కూటమి (India bloc) సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సమావేశాల్లో చర్చించాల్సిన కీలక అంశాలు, అనుసరించాల్సిన వ్యూహంపై విపక్ష ఇండియా (INDIA) కూటమి నేతలు శనివారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. 24 పార్టీలకు చెందిన నేతలు హాజరయినట్టు కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ జైరామ్ రమేష్ తెలిపారు. చాలా వారాల తర్వాత ఇండియా కూటమి నేతల సమన్వయ సమావేశం జరగడం విశేషం.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియాగాంధీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, సీపీఐ (ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపంకర్ భట్టాచార్య తదితరులు ఈ వర్చువల్ మీట్‌లో పాల్గొన్నారు. బీహార్‌లో ఎన్నికల కమిషనర్ ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టడం, ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ వంటి అంశాలు సమావేశం ఎజెండాలో కీలకంగా ఉన్నాయి. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాను మధ్యవర్తిత్వం చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకోవడం, తన నివాసంలో కాలిన నోట్ల కట్టలు కనిపించడంతో వివాదంలో చిక్కుకున్న జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండటంపై వీటిపై ఉభయసభల్లో అనుసరించాల్సిన వైఖరిని సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది.
జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కాంగ్రెస్ పట్టుబట్టనుంది. మహిళలపై పెరుగుతున్న నేరాలు, అహ్మదాబాద్ విమానం ప్రమాదం, పెరుగుతున్న నిరుద్యోగం, రైతుల కష్టాలు వంటి అంశాలను కూడా పార్లమెంటులో ప్రస్తావించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ అంశాలపై పార్టీ అనుసరించాల్సిన వ్యూహాంపై ఈవారం ప్రారంభంలో 10 జనపథ్ నివాసంలో సోనియాగాంధీ అధ్యక్షతన పార్టీ పార్లమెంటరీ స్ట్రాజజీ గ్రూప్ సమావేశం కూడా జరిగింది.
ఇవి కూడా చదవండి..
BCCI: సిగ్గుసిగ్గు.. బీసీసీఐపై విరుచుకుపడిన ప్రియాంక చతుర్వేది
అధికార పార్టీ ఎమ్మెల్యే రాజీనామా.. రాజకీయాలకూ గుడ్‌బై
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి