Operation Sindhu: ఇజ్రాయెల్ నుంచి కూడా భారతీయుల తరలింపు
ABN , Publish Date - Jun 22 , 2025 | 02:48 PM
ఇజ్రాయెల్‌లో ఉంటూ స్వదేశానికి తిరిగి రావాలనుకునే భారతీయులను వెనక్కి తెచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్టు భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) ప్రకటించింది. ముందుగా ఇజ్రాయెల్ నుంచి భూ సరిహద్దుల ద్వారా, తరువాత భారత్‌కు వాయుమార్గం ద్వారా ప్రయాణ సౌకర్యం కలిస్తామని తెలిపింది.

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాడులు, అమెరికా సైతం ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై తాజాగా దాడులు చేయడంతో మధ్యప్రాశ్చంలో యుద్ధ మరింత తీవ్రమైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరాన్ నుంచి 'ఆపరేషన్ సింధు' (Operation Sindhu) పేరుతో భారతీయులను వెనక్కి తీసుకువచ్చిన భారత ప్రభుత్వం ఇప్పుడు ఈ ఆపరేషన్‌ను ఇజ్రాయెల్ కూడా విస్తరించింది. ఇజ్రాయెల్‌లోని భారతీయులను స్వదేశానికి తీసుకువస్తోంది.
ఇజ్రాయెల్‌లో ఉంటూ స్వదేశానికి తిరిగి రావాలనుకునే భారతీయులను వెనక్కి తెచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్టు భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) ప్రకటించింది. ముందుగా ఇజ్రాయెల్ నుంచి భూ సరిహద్దుల ద్వారా, తరువాత భారత్‌కు వాయుమార్గం ద్వారా ప్రయాణ సౌకర్యం కలిస్తామని తెలిపింది. విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రతకు భారత్ అధిక ప్రాధాన్యమిస్తుందని తెలిపింది.
భారత్ చేరుకోవాలనుకునే వారు టెల్ అవివ్‌లోని రాయబార కార్యాలయంలో తమ పేర్లు రిజిస్టర్ చేయించుకోవాలని ఎంఈఏ సూచించింది. ఇప్పటికీ రిజిస్టర్ చేయించుకోని వారు అధికారిక పోర్టల్ www.indembassyisrael.gov.in/indian_national_reg లో రిజిస్టర్ చేయించుకోవాలని కోరింది. 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, +972 54-7520711 and +972 54-3278392 నెంబర్లలో సంప్రదించాలని, ఇ-మెయిల్ హెల్ప్‌లైన్ cons1.telaviv@mea.gov.in. కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇజ్రాయెల్‌లో సుమారు 18,000 మంది భారతీయులు ఉంటున్నారు.
ఇరాన్‌లో కొనసాగుతున్న ఆపరేషన్
భారత ప్రభుత్వం ఇరాన్ నుంచి భారతీయుల తరలింపు కోసం ఏర్పాటు చేసిన 'ఆపరేషన్ సింధూర్' కొనసాగుతోంది. ఇప్పటికే 300 మందికి పైగా విద్యార్థులతో కలిపి మొత్తం 800 మందిని స్వదేశానికి తీసుకువచ్చింది.
ఇవి కూడా చదవండి..
పహల్గామ్ నిందితులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు అరెస్ట్..
J&K Police: ఉగ్రవాదులకు ఝలక్ ఇచ్చిన జమ్మూ కశ్మీర్ పోలీసులు
For National News And Telugu News