Air pollution in India: దేశంలో క్షీణిస్తున్న గాలి నాణ్యత.. టాప్-10 ప్రాంతాలివే..
ABN , Publish Date - Nov 09 , 2025 | 05:06 PM
స్వచ్ఛమైన గాలిలో నాణ్యత రోజు రోజుకూ క్షీణిస్తోంది. సెప్టెంబర్ నెలతో పోలిస్తే అక్టోబర్‌లో వాయు కాలుష్యం మరింత పెరిగినట్టు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. గాలి నాణ్యత లోపించిన ప్రాంతాల్లో హరియాణాలోని ధారుహెరా తొలి స్థానంలో ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీ ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో గాలి నాణ్యత(Air quality in India) రోజు రోజుకూ క్షీణిస్తోంది. దేశంలో అక్టోబర్(October)లో వాయు కాలుష్యం(Air polution) మరింత పెరిగింది. మరీ ముఖ్యంగా ఇండో-గంగా(Indo-Ganga) మైదానంలో చాలా తక్కువ స్థాయిలో స్వచ్ఛమైన గాలి అందుబాటులో ఉన్నట్టు సెంటర్ ఫర్ రీసెర్చ్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్(CREA) పరిశోధనలో వెల్లడైంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(World Health Organisation) ప్రమాణాల ప్రకారం.. క్యూబిక్ మీటర్ గాలిలో అతి సూక్ష్మ ధూళి కణాల(PM 2.5) ఏడాది సగటు సాంద్రత 5 మైక్రోగ్రామ్‌లు(Micro Grams), అలాగే ఒకరోజు వ్యవధిలో ఈ స్థాయి 15ఎం.జీ.లకు మించరాదు. జాతీయ వాయు నాణ్యతా ప్రమాణాల ప్రకారం వీటి స్థాయి 40-60 ఎం.జీ.ల మధ్య ఉండాలి. అయితే.. గత నెలలో అనేక ప్రాంతాల్లో పీఎం 2.5 సాంద్రతలు ఎక్కువ మోతాదులో నమోదయ్యాయి. సెప్టెంబర్(September) నెలతో పోలిస్తే ఇది చాలా అధికం.
అత్యంత కాలుష్య నగరాల్లో.. హరియాణాలోని ధారుహెరా(Dharuhera)లో పీఎం 2.5 అత్యధిక స్థాయిలో 123 ఎం.జీ.లకు చేరగా.. అదే రాష్ట్రంలోని రోహ్‌తక్(Rohtak) ప్రాంతం ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. గాలి నాణ్యత క్షీణించిన తొలి పది ప్రాంతాల్లో ఎనిమిదేసి చొప్పున ప్రదేశాలు హరియాణా(Haryana), ఉత్తర్ ప్రదేశ్(UP)లే ఉండటం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది. ఇక ఢిల్లీలో (Delhi) ఈ మధ్య పంట వ్యర్థాల దహనం సమస్యలు లేకపోయినా.. పీఎం 2.5 107ఎం.జీ.లతో 6వ స్థానంలో ఉంది.
అక్టోబర్‌లో గాలినాణ్యత క్షీణించిన టాప్-10 ప్రాంతాలు:
ధారుహెరా (హరియాణా)
రోహ్‌తక్ (హరియాణా)
ఘాజియాబాద్ (ఉత్తర్ ప్రదేశ్)
నొయిడా (ఉత్తర్ ప్రదేశ్)
బల్లబ్‌గఢ్ (హరియాణా)
ఢిల్లీ (న్యూ ఢిల్లీ)
భివండీ (మహారాష్ట్ర)
గ్రేటర్ నొయిడా (ఉత్తర్ ప్రదేశ్)
హాపుర్ (ఉత్తర్ ప్రదేశ్)
గురుగావ్ (హరియాణా)
ఇలా దేశంలోని మొత్తం 249 నగరాల్లో గాలి నాణ్యతను పరిశీలిస్తే.. 212 చోట్ల పీఎం 2.5 ప్రమాణాలు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నిర్దేశించిన దానికంటే అధికంగా ఉన్నట్టు వెల్లడైంది. స్వచ్ఛమైన గాలి నాణ్యతను నమోదు చేసే నగరాల సంఖ్య సెప్టెంబర్‌లో 170 ఉంటే.. అక్టోబర్ నాటికి 68కి పడిపోయింది.
దుష్ప్రభాలివే..
గాలిలో నాణ్యత క్షీణించి పీఎం 2.5 స్థాయిలు పెరగడం వల్ల లక్షలాది మంది శ్వాసకోశ, హృదయ సంబంధిత సమస్యల బారినపడే అవకాశముంది. దీనిపై కాలానుగుణ చర్యలు మాత్రమే కాకుండా దీర్ఘకాలిక చర్యలూ అవసరమని ప్రస్ఫుటమవుతోంది. ఇందుకోసం ప్రస్తుతం.. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(GRAP) వంటి స్పల్పకాలిక చర్యలు చేపడతున్నప్పటికీ వాహనాలు, పారిశ్రామిక కర్మాగారాలు, దుమ్ము-ధూళి, గృహ ఇంధన వినియోగం నుంచి వచ్చే ఉద్గారాలనూ పరిష్కరించాల్సిన అవసరముంది. లేదంటే ఈ స్థాయిల్లో గణనీయ పెరుగుదల నమోదయ్యే అవకాశముంది.
ఇవి కూడా చదవండి..
గుజరాత్‌లో ముగ్గురు ఉగ్రవాద అనుమానితుల అరెస్ట్
పిల్లలకు వారు తుపాకులిస్తే.. మేం ల్యాప్‌టాప్ ఇస్తున్నాం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి