Share News

పన్ను ఎగవేతదారుల వేటకు ఇంటర్‌పోల్‌ సాయం

ABN , Publish Date - Jan 14 , 2025 | 05:21 AM

పన్ను ఎగవేతదారుల భరతం పట్టేందుకు ఇంటర్‌పోల్‌ సాయం తీసుకోవాలని ఆదాయపన్ను శాఖ నిర్ణయించింది.

పన్ను ఎగవేతదారుల వేటకు ఇంటర్‌పోల్‌ సాయం

ముంబై/న్యూఢిల్లీ, జనవరి 13: పన్ను ఎగవేతదారుల భరతం పట్టేందుకు ఇంటర్‌పోల్‌ సాయం తీసుకోవాలని ఆదాయపన్ను శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఎక్కడున్నారు? వారి గుర్తింపు? రహస్య ఆస్తులు తదితర సమాచారాన్ని పొందడానికి ఇంటర్‌పోల్‌ సాయం తీసుకోవాలని ప్రణాళికలు రూపొందించింది. అధికారిక నేర పరిశోధనకు ముందు వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడం తదితర చర్యలను వేగవంతం చేయడమే దీని లక్ష్యం.


ఇప్పటికే ఈ విషయాల్లో అంతర్జాతీయ సహకారం కోసం ఎంఎల్‌ఏ(మ్యూచువల్‌ లీగల్‌ అసిస్టెన్స్‌) ఒప్పందాలు, ఎల్‌ఆర్‌(లెటర్‌ రొగేటరీ)లను భారత్‌ వినియోగించుకుంటోంది. భారత్‌కు సుమారు 42 దేశాలతో ఎంఎల్‌ఏ ఒప్పందాలు ఉన్నాయి. ఎల్‌ఆర్‌ను ఇతర దేశాలకు పంపడం ద్వారా ఆ దేశాల సహకారం పొందుతారు. ఈ విషయంలో తాజాగా 194 సభ్యదేశాలతో ప్రపంచ అతిపెద్ద అంతర్జాతీయ పోలీసు సంస్థగా ఉన్న ఇంటర్‌పోల్‌ సాయం తీసుకోవాలని ఐటీశాఖ నిర్ణయించింది.

Updated Date - Jan 14 , 2025 | 05:21 AM