Share News

Southwest Monsoon: నైరుతి ద్వితీయార్ధంలో మంచి వర్షాలు

ABN , Publish Date - Aug 01 , 2025 | 02:44 AM

నైరుతి రుతుపవనాల సీజన్‌లో తొలి రెండు నెలలు ముగిశాయి. శుక్రవారం నుంచి ద్వితీయార్ధం (

Southwest Monsoon: నైరుతి ద్వితీయార్ధంలో మంచి వర్షాలు

  • ఆగస్టులో సాధారణ వర్షపాతం: ఐఎండీ

  • సీజన్‌ తొలి 2నెలల్లో దేశంలో 6.5% ఎక్కువ

విశాఖపట్నం, జూలై 31 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాల సీజన్‌లో తొలి రెండు నెలలు ముగిశాయి. శుక్రవారం నుంచి ద్వితీయార్ధం (ఆగస్టు, సెప్టెంబరు) ప్రారంభంకానుంది. ఈ భాగంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణంకంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఈశాన్య రాష్ట్రాలు, కేరళ, కర్ణాటక, ఏపీలోని ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాలు, బిహార్‌లో ఎక్కువ ప్రాంతం, ఒడిశా, ఝార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌లో కొన్నిచోట్ల సాధారణంకంటే తక్కువ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆగస్టు, సెప్టెంబరుల్లో దేశవ్యాప్తంగా 422.8 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉండగా, దీర్ఘకాలిక సగటులో 106శాతం కంటే ఎక్కువగా పడతాయని తెలిపింది. ఆగస్టులో దేశంలో 254.9 మి.మీ. వర్షపాతం కురవాలి. ఈ నెలలో సాధారణ వర్షపాతం (దీర్ఘకాల సగటుకంటే 94నుంచి 106ు) కురుస్తుందని గురువారం ఐఎండీ పేర్కొంది. అయితే కేరళ, కర్ణాటకలో అనేక ప్రాంతాలు, ఉత్తర తెలంగాణ, ఉత్తర కోస్తా, విదర్భ, మధ్య మహారాష్ట్ర, మరట్వాడ, ఒడిశా, ఛత్తీ్‌సగఢ్‌లో అనేక ప్రాంతాలు, బిహార్‌, ఈశాన్య భారతం, కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాభావం కొనసాగుతుందని వివరించింది. జూన్‌, జూలైల్లో దేశంలో 445.8 మి.మీ.కు గాను 474.3 మి.మీ. (సాధారణం కంటే 6.5ుఎక్కువ)వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం ఉన్న తటస్థ పరిస్థితులు అక్టోబరు వరకూ కొనసాగుతాయని, నైరుతి సీజన్‌ ముగిశాక బలహీన లానినా పరిస్థితులు ఏర్పడవచ్చని ఐఎండీ పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్

జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..

For More Telangana News And Telugu News

Updated Date - Aug 01 , 2025 | 02:44 AM