Delhi blast: ఢిల్లీ పేలుడు.. కారు డ్రైవర్‌కు అక్రమ మార్గాల ద్వారా రూ.20 లక్షలు..
ABN , Publish Date - Nov 16 , 2025 | 10:04 AM
గత సోమవారం ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో రద్దీగా ఉండే ప్రాంతంలో ఐ-20 కారు నుంచి విస్పోటనం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మృత్యువాత పడ్డారు. పలువురు గాయపడ్డారు. ఈ కేసు విచారిస్తున్న అధికారులు తాజాగా పలు కీలక విషయాలను వెల్లడించారు
దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక కట్టడం ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో రద్దీగా ఉండే ప్రాంతంలో ఐ-20 కారు నుంచి విస్పోటనం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మృత్యువాత పడ్డారు. పలువురు గాయపడ్డారు. ఈ కేసు విచారిస్తున్న అధికారులు తాజాగా పలు కీలక విషయాలను వెల్లడించారు (Delhi explosion investigation).
ఆ కారు నడిపిన డ్రైవర్ ఉమర్ మొహమ్మద్ అలియాస్ ఉమర్ నబీ పలు అక్రమ మార్గాల ద్వారా రూ.20 లక్షలు సేకరించినట్టు తాజాగా బయటపడింది (i20 driver news). ఆ డబ్బుతో హర్యానాలోని నుహ్ మార్కెట్‌లోని ఒక దుకాణం నుంచి పెద్ద మొత్తంలో అమ్మోనియం నైట్రేట్ సేకరించాడు. అమ్మోనియం నైట్రేట్, ఇంధన నూనె కలిగిన పేలుడు సమ్మేళనాన్ని ఈ బ్లాస్ట్ కోసం ఉపయోగించినట్లు అధికారులు నిర్ధారించారు.
ఇకపోతే.. 1989లో జమ్మూ, కశ్మీర్‌లోని పుల్వామాలో జన్మించిన ఉమర్ నబీ ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో డాక్టర్. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ యూనివర్సిటీకి చెందిన పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు (terror funding sources).
ఎర్రకోటలో సంభవించిన ఈ పేలుడుకు కొన్ని గంటల ముందు నిఘా వర్గాలు కశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో విస్తరించి ఉన్న జైష్-ఎ-మొహమ్మద్, అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్‌లకు సంబంధించిన టెర్రర్ మాడ్యూల్‌ను వెలికితీసి, ముగ్గురు వైద్యులు సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు (Delhi crime news). అలాగే 2,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఉమర్ నబీకి డబ్బులు ఎలా వచ్చాయని పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు. విచారణ కోసం అనేక మంది హవాలా డీలర్లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
సీఐఐ సదస్సు సూపర్ హిట్.. కూటమి ప్రభుత్వంపై మన్నవ మోహనకృష్ణ ప్రశంసలు..
షాకింగ్ .. ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లు బంద్..