Honeymoon Muder Case: సోనమ్ రఘవంశీకి 13 రోజుల జ్యుడిషియల్ కస్టడీ
ABN , Publish Date - Jun 21 , 2025 | 09:02 PM
సోనమ్, రాజా కుష్వాహలను జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవాలని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తుషార్ చందా ఆదేశించారు. జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని ఇన్వెస్టిగేటింగ్ అధికారి కోరగా, నిందితుల కస్టడీని పోలీసులు కోరలేదు.

షిల్లాంగ్: హనీమూన్‌కు వెళ్లి హత్యకు గురైన రాజా రఘువంశీ (Raja Raghuvanshi) కేసులో ఆయన భార్య, కీలక నిందితురాలు సోనమ్ రఘవంశీకి షిల్లాంగ్‌లోని జిల్లా షెషన్స్ కోర్టు 13 రోజుల జ్యుడిషయల్ కస్టడీకి ఆదేశించింది. ఆమెతో పాటు ఆమె బాయ్‌ఫ్రెండ్, మరో నిందితుడు రాజ్ కుష్వాహకు సైతం జ్యుడిషయల్ కస్టడీ విధించింది. హనీమూప్ ట్రిప్‌లో హత్యకు గురైన రాజ రఘవంశీ కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ హత్యతో ప్రమేయం ఉన్న సోనమ్, కుష్వాహ, మరో ముగ్గురిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
కాగా, సోనమ్, రాజా కుష్వాహలను జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవాలని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తుషార్ చందా ఆదేశించారు. జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని ఇన్వెస్టిగేటింగ్ అధికారి కోరగా, నిందితుల కస్టడీని పోలీసులు కోరలేదు.
లోతుగా విచారణ జరపాలి
కాగా, ఎనిమిది రోజుల కస్టడీలో పోలీసు ఇన్వెస్టిగేటర్స్‌ను సోనమ్ తప్పుదారి పట్టించారని రాజా రఘవంశీ పెద్ద సోదరుడు సచిన్ రఘువంశీ ఇండోర్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. కుట్ర పథకాన్ని పూర్తి స్థాయిలో వెలికి తీసేందుకు, నిందితులను మరింత లోతుగా ప్రశ్నించేందుకు పోలీసు రిమాండ్‌ను పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు. కీలక సమాచారాన్ని సోనమ్ దాచిపెట్టిందని, మరింత సమగ్ర విచారణ కోసం నిందితులను ఇండోర్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలని అన్నారు. ఈ కుట్రలో సోనమ్ కుటుంబసభ్యులు, సన్నిహితుల ప్రమేయానికి అవకాశం ఉందని, వీరికి నార్కో టెస్టులు జరపాలని కోరారు. ఈ స్థాయిలో హత్యకు ప్లాన్ చేయడం అంత సులభం కాదని, ఆమెకు సన్నిహితంగా ఉన్న వారిని మరింత లోతుగా విచారించాలని అన్నారు.
నా కొడుకుని ఎందుకు చంపింది?
రాజా రఘవంశీ తల్లి ఉమా రఘువంశీ భావోద్వేగానికి గురయ్యారు. తన కొడుకును ఎందుకు చంపిందో సోనమ్ వివరణ ఇవ్వాలని, నిజం ఆమె నోట వెంట వినేంతవరకూ తనకు శాంతి లేదని అన్నారు. ఈ కేసులో ప్రమేయమున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా విచారణ జరపాలని దర్యాప్తు అధికారులను కోరారు. మే 11న వివాహం చేసుకున్న రాజా, సోనమ్ దంపతులు మే 20న హనీమూన్ ట్రిప్ కోసం మేఘాలయ వెళ్లారు. మే 23 నుంచి రాజా కనిపించకుండా పోయాడు. అయితే పదిరోజుల తర్వాత జూన్ 2న అతని మృతదేహం ఈస్ట్ కాశీ హిల్స్ జిల్లాలో కనిపించడం సంచలనమైంది. సోనమ్ తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కిరాయి గూండాలతో ఈ హత్య చేయించినట్టు పోలీసు విచారణలో తేలింది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ నుంచి 310 మంది భారతీయులతో ఢిల్లీ చేరిన మరో విమానం
సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించం...తేల్చిచెప్పిన అమిత్‌షా
For National News And Telugu News