Sambhal Holi: సంభాల్‌లో ప్రశాంతంగా హోలి, శుక్రవారం ప్రార్ధనలు
ABN , Publish Date - Mar 14 , 2025 | 09:52 PM
సంభాల్‌లో శుక్రవారం జరిగిన హోలీ ఊరేగింపులో 3,00 మంది ప్రజలు పాల్గొన్నట్టు జిల్లా మెజిస్ట్రేట్ రాజేంద్ర పెన్సియా తెలిపారు. ఆర్పీఎఫ్, ప్రొవిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ, స్థానిక పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్ల చేశారని, డోన్లతో నిఘా నిర్వహించామని, ఎట్టకేలకు హోలి, రంజాన్ శుక్రవారం ప్రార్థనలు ప్రశాంతంగా ముగిసాయని చెప్పారు.

సంభాల్: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా హోలీ వేడుకలు, రంజాన్ శుక్రవారం ప్రార్థనలు ముగిసాయి. దీంతో అధికార యంత్రాగం తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. హోలీ, రంజాన్ రెండో శుక్రవారం ఒకేరోజు రావడం, గత నవంబర్ 24న షామా జామా మసీదు సర్వే సమయంలో తలెత్తిన హింసాకాండంలో నలుగురు మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు లేకుండా హోలీ, శుక్రవారం ప్రార్థనలు నిర్వహించడాన్ని యూపీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. శాంతి కమిటీలతో విస్తృత చర్చలు జరిపి, హోలీ ఊరేగింపు మార్గంలో మసీదులకు టార్పాలిన్ షీట్లు కప్పడం, డ్రోన్లతో నిఘా నిర్వహించడం, ఫ్లాగ్ మార్చ్ వంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది.
Yogi Adityanath: ఐక్యంగా ఉంటే దేశాన్ని ఏ శక్తీ ఆపలేదు.. యోగి హోలీ సందేశం
కాగా, సంభాల్‌లో శుక్రవారం జరిగిన హోలీ ఊరేగింపులో 3,00 మంది ప్రజలు పాల్గొన్నట్టు జిల్లా మెజిస్ట్రేట్ రాజేంద్ర పెన్సియా తెలిపారు. ఆర్పీఎఫ్, ప్రొవిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ, స్థానిక పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్ల చేశారని, డోన్లతో నిఘా నిర్వహించామని, ఎట్టకేలకు హోలి, రంజాన్ శుక్రవారం ప్రార్థనలు ప్రశాంతంగా ముగిసాయని చెప్పారు. జిల్లాలో 1,212 ప్రాంతాల్లో 'హోలీ కా దహన్' ప్రశాంతంగా జరిగినట్టు తెలిపారు.
మరోవైపు, మెఘల్ కాలం నాటి షాహి జామా మసీద్ వద్ద ప్రార్థనల సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. హోలి, శుక్రవారం ప్రార్థనలు ప్రశాంతంగా జరుపుకోవాలని మసీదు మేనిజిమెంట్ కమిటీ అధ్యక్షుడు జఫర్ అలి పిలుపునిచ్చారు. హోలి కారణంగా జుమ్మా నమాజ్ సమయాన్ని స్థానిక యంత్రాంగం మధ్యాహ్నం 2.30 వరకూ పొడిగించారు. దీనికి ముందు సంభాల్ సిటీలో హోలీ ఊరేగింపు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి..