Share News

Hero Vijay: వేలూరులో టీవీకే రెండో బూత్‌ కమిటీ మహానాడు

ABN , Publish Date - May 21 , 2025 | 01:19 PM

మరో ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించేందుకు ఆపార్టీ అధినేత విజయ్ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సభలు, సమావేశాల నిర్వహణ ద్వారా కార్యకర్తలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా వేలూరులో టీవీకే రెండో బూత్‌ కమిటీ మహానాడు నిర్వహించనున్నారు.

Hero Vijay: వేలూరులో టీవీకే రెండో బూత్‌ కమిటీ మహానాడు

- హీరో విజయ్‌ సన్నాహాలు

చెన్నై: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా హీరో విజయ్‌(Hero Vijay) సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం అడుగులు వేస్తోంది. వివిధ రకాలైన కార్యక్రమాలను చేపడుతోంది. ఇటీవల ఆ పార్టీ బూత్‌ కమిటీ మహానాడును నిర్వహించింది. ఇప్పుడు రెండో మహానాడును వేలూరులో నిర్వహించాలని భావిస్తోంది. ఇందులో వేలూరు, రాణిపేట, తిరుణ్ణామలై, తిరుపత్తూరు, కడలూరు, కృష్ణగిరితో పాటు మొత్తం 20 జిల్లాల బూత్‌ కమిటీ సభ్యులు పాల్గొనేలా సన్నాహాలు చేస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Ramdas: నాటకమాడింది చాలు... నీట్‌ రద్దు చేయించండి


nani5.2.jpg

రెండు రోజుల పాటు సాగే ఈ మహానాడులో ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్‌ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే, వేలూరు పట్టణంలో రోడ్‌ షో కూడా నిర్వహించనున్నట్టు సమాచారం. అయితే, మహానాడు జరిగే తేదీలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. ఆ తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌, ఇతర నిర్వాహకులు ఈ మహానాడు ఏర్పాట్లు పనులు ప్రారంభించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

నల్లమల సంపదపై రేవంత్‌ కన్ను: బీఆర్‌ఎస్‌

BSF Jawan: దేశసేవకు వెళ్లి.. విగతజీవిగా ఇంటికి..

Adilabad MP Nagesh: పటాన్‌చెరు- ఆదిలాబాద్‌ రైల్వే లైన్‌ నిర్మాణ పనులు చేపట్టాలి

గోవుల అక్రమ రవాణా

Read Latest Telangana News and National News

Updated Date - May 21 , 2025 | 01:19 PM