Share News

School Holiday: రెయిన్స్ ఎఫెక్ట్.. రెండ్రోజులు స్కూల్స్ బంద్..

ABN , Publish Date - Jun 13 , 2025 | 08:32 PM

కేరళలోని కాసరగోడ్, కన్నూర్, కోజికోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. జూన్ 14, 15 తేదీల్లో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

School Holiday: రెయిన్స్ ఎఫెక్ట్.. రెండ్రోజులు స్కూల్స్ బంద్..
School Holiday

కేరళ: కేరళలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 14, 2025 నుంచి జూన్ 17 వరకూ కేరళ (kerala) వ్యాప్తంగా భారీ తుఫాను హెచ్చరికలను భారత వాతావరణ శాఖ జారీ చేసింది. దీంతో కన్నూర్ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు, అంగన్‌వాడీలు, ప్రొఫెషనల్ కాలేజీలు, ట్యూషన్ సెంటర్లన్నీ జూన్ 14, 15 తేదీల్లో బంద్ చేయాలని (School Holiday) జిల్లా కలెక్టర్ ఆదేశించారు.


వాతావరణ హెచ్చరికలు

IMD ప్రకారం కేరళలోని కాసరగోడ్, కన్నూర్, కోజికోడ్ జిల్లాలకు జూన్ 14, 15 తేదీల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. రెడ్ అలర్ట్ అంటే 24 గంటల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం పడే అవకాశం ఉందని సూచిస్తుంది. మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇలాంటి వాతావరణ పరిస్థితుల కారణంగా సముద్రంలో గాలుల వేగం 35-55 కిలోమీటర్ల వేగంతో ఉండే అవకాశం ఉంది. కాబట్టి జూన్ 14 నుంచి 17 జూన్ వరకూ కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ తీర ప్రాంతాల్లో జాలరులు చేపల వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది.


ప్రజలకు సూచనలు

ఇదే సమయంలో నిర్మాణాలు లేని ఇళ్లలో నివసిస్తున్న వారు భవనాలకు తరలివెళ్లాలన్నారు. వాహనాలను చెట్ల కింద పార్క్ చేయెుద్దని, గాలుల కారణంగా చెట్లు పడిపోతాయని గుర్తు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దీంతోపాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం సూచనల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుని ప్రయాణాలు చేయాలన్నారు అధికారులు.


ఈ వార్తలు కూడా చదవండి..

మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..


పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. జూన్ 15 లాస్ట్ డేట్, లేదంటే..

For National News And Telugu News

Updated Date - Jun 13 , 2025 | 09:33 PM