Share News

Air India Crash Probe: విమాన ప్రమాదం దర్యాప్తు అధికారికి ఎక్స్ కేటగిరి భద్రత

ABN , Publish Date - Jun 28 , 2025 | 08:26 PM

యుగంధర్‌కు ముప్పు ఉందనే నివేదిక ఆధారంగా ఆయనకు రక్షణ కల్పించాలని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దీంతో ఏఏఐబీ చీఫ్ దేశంలో జరిపే పర్యటనల్లో ఆయన వెంట ముగ్గురు నుంచి నలుగురు సీఆర్‌పీపీ సిబ్బంది ఉంటారు.

Air India Crash Probe: విమాన ప్రమాదం దర్యాప్తు అధికారికి ఎక్స్ కేటగిరి భద్రత

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌‌లో జూన్ 12న ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురై 270 మంది మృతి చెందిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దర్యాప్తునకు సారథ్యం వహిస్తున్న ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) డైరెక్టర్ జనరల్ జీవీజి యుగంధర్‌కు కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. ఆయనకు 'ఎక్స్' క్యాటగిరి సాయుధ భద్రతను కేటాయించింది.

యుగంధర్‌కు ముప్పు ఉందనే నివేదిక ఆధారంగా ఆయనకు రక్షణ కల్పించాలని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దీంతో ఏఏఐబీ చీఫ్ దేశంలో జరిపే పర్యటనల్లో ఆయన వెంట ముగ్గురు నుంచి నలుగురు సీఆర్‌పీపీ సిబ్బంది ఉంటారు.

అహ్మదాబాద్ ట్రాజెడీ..

అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు జూన్ 12న బయలుదేరిన ఏఐ171 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ గాలిలోకి వెళ్లిన కొద్దిసేపటికే కుప్పకూలింది. మేఘని నగర్ ఏరియాలోని మెడికల్ హాస్టల్ కాంప్లెక్స్‌పై విమానం కుప్పకూలడంతో అందులోని 242 మంది ప్రయాణికుల్లో 241 మంది మృతిచెందారు. కుప్పకూలిన ప్రదేశంలోని మరో 29 మంది కూడా ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 270కి చేరింది. ప్రమాద స్థలిలో లభించిన బ్లాక్ బాక్స్‌ను రిట్రైవ్ చేసి, దానిని విశ్లేషించేందుకు భారీ భద్రత మధ్య ఢిల్లీకి పంపారు. జూన్ 13, 16 తేదేల్లో ప్రమాదస్థలి నుంచి సీవీఆర్, ఎఫ్‌డీఆర్‌లను స్వాధీనం చేసుకున్నట్టు పౌర విమానయాన శాఖ తెలిపింది. ఒక రికార్డరు బిల్డింగ్ పైన, మరొకటి శిథాలాల వద్ద దొరికినట్టు చెప్పింది. జూన్ 24న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దానిని రాజధానికి తరలించింది. ఫ్రంట్ రికార్డర్ నుంచి డాటా మాడ్యూల్‌ను జూన్ 25న ఢిల్లీలోని ఏఏఐబీ ల్యాబొరేటరీలో డౌన్‌లోడ్ చేసారు.

ఇవి కూడా చదవండి..

కోల్‌కతా లా కాలేజీ అత్యాచార ఘటన.. సెక్యూరిటీ గార్డు అరెస్టు

ఐఎస్ఐఎస్ ఇండియా మాజీ చీఫ్ ఆసుపత్రిలో కన్నుమూత

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 28 , 2025 | 08:27 PM