Googles Gemini:భారతీయ యూజర్లందరికీ అందుబాటులో జెమినీ 2.5 ఏఐ
ABN , Publish Date - Jul 09 , 2025 | 02:43 AM
గూగుల్ ఏఐ టూల్ జెమినీ తాజా వెర్షన్ ఇకపై భారతీయ యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది.

న్యూఢిల్లీ, జూలై 8: గూగుల్ ఏఐ టూల్ జెమినీ తాజా వెర్షన్ ఇకపై భారతీయ యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది. జెమినీ 2.5 వెర్షన్‌ను సెర్చింజన్‌తోపాటు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. టెక్స్ట్ రూపంలో సమాచారాన్ని కోరినా, వాయిస్ ద్వారా ప్రశ్నించినా.. ఏదైనా ఫొటోను అప్‌లోడ్ చేసినా.. జెమినీ 2.5 సమాచారం అందజేస్తుందని వివరించింది. ప్రత్యేక ట్యాబ్‌లో సెర్చ్ ఫలితాలు కనిపిస్తాయని, వినియోగదారులకు అనుబంధ ప్రశ్నలు వేసే అవకాశాలుంటాయని పేర్కొంది.