Odisha Puri Incident: ఒడిశా హారర్.. బాలికకు నిప్పంటించిన దుండగులు
ABN , Publish Date - Jul 19 , 2025 | 02:46 PM
ఈ ఘటనపై ఉపముఖ్యమంత్రి, మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఇన్‌చార్జి ప్రవతీ పరిదా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రోడ్డుపై వెళ్తున్న బాలికలపై ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ చల్లి నిప్పటించారని, బాలికను హుటాహుటిన ఎయిమ్స్‌కు తరిలించామని చెప్పారు.

పూరి: బాలాసోర్‌లో లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహుతి చేసుకున్న కాలేజీ విద్యార్థిని ఘటన ఇంకా సద్దుమణగక ముందే ఒడిశాలో మరో దారుణం చోటుచేసుకుంది. పూరీ జిల్లా బ్యాబర్ గ్రామంలో శనివారం నాడు 15 ఏళ్ల బాలికకు ముగ్గురు దుండగులు నిప్పంటించారు. తన స్నేహితురాలి ఇంటికి వెళ్తుండగా వెంబడించిన దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడ్నుంచి పరారయ్యారు. కాగా, మంటల్లో తీవ్రంగా గాయపడిన బాలికను భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు.
ఈ ఘటనపై ఉపముఖ్యమంత్రి, మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఇన్‌ఛార్జ్ ప్రవతీ పరిదా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రోడ్డుపై వెళ్తున్న బాలికలపై ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ చల్లి నిప్పటించారని, బాలికను హుటాహుటిన ఎయిమ్స్‌కు తరిలించామని చెప్పారు. చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఇందుకయ్యే ఖర్చు మెుత్తం ప్రభుత్వమే భరిస్తుందన్నారు. నిందితులను అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఆదేశాలిచ్చినట్టు చెప్పారు.
బాలాసోర్ ఘటన
బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ (అటానమస్) కాలేజీ విద్యార్థిని (20).. టీచర్ వేధింపులకు తాళలేక క్యాంపస్‌లోనే జూన్ 12న ఆత్మాహుతికి పాల్పడింది. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. 90 శాతానికి పైగా గాలిన గాయాలతో 14వ తేదీ రాత్రి భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో కన్నుమూసింది. ఈ ఘటనకు సంబధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకరిని అరెస్టు చేశారు. యూజీసీ నిజనిర్ధారణ కమిటీ ఈ ఘటనపై విచారణ జరుపుతోంది.
ఇవి కూడా చదవండి..
ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మౌనం వీడాలి
వందే భారత్ రైళ్ల బుకింగ్‌లో కొత్త సదుపాయం.. అదేంటంటే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి