Adani Healthcare Temples: భారత వైద్య రంగంలో అద్భుతం.. అదానీ గ్రూప్ హెల్త్‌కేర్ టెంపుల్స్
ABN , Publish Date - Jul 11 , 2025 | 03:59 PM
ప్రజలందరికీ అత్యవసరమైన వైద్య సేవలు ఇప్పుడు అత్యంత కాస్ట్లీ వ్యవహారంలా మారిపోయాయి. ఈ నేపథ్యంలో విప్లవాత్మకంగా దేశంలో అదానీ వైద్య ఆలయాలు రాబోతున్నాయి. ఇవి దేశ వైద్యరంగాన్ని కొత్తపుంతలు తొక్కించబోతున్నాయి.

ముంబై , జూలై 11 : అదానీ గ్రూప్ భారతదేశ వ్యాప్తంగా అద్భుతమైన హెల్త్‌కేర్ టెంపుల్స్ నిర్మించబోతోంది. మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ హాస్పిటల్స్ గా వీటిని రూపొందించబోతున్నారు. మొదటి విడతగా అహ్మదాబాద్, ముంబైలలో వీటిని ప్రారంభించబోతున్నామని సంస్థ ఛైర్మన్ గౌతం అదాని ఇవాళ ప్రకటించారు.
ఈరోజు(శుక్రవారం) ముంబైలో జరిగిన సొసైటీ ఫర్ మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీ - ఆసియా పసిఫిక్ (SMISS-AP) 5వ వార్షిక సమావేశంలో అదానీ మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. అహ్మదాబాద్, ముంబైలో 1,000 పడకల ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌ల ద్వారా అదానీ హెల్త్‌కేర్ టెంపుల్స్ వాగ్దానాన్ని నెరవేరుస్తామని అదానీ చెప్పారు.
ఈ హెల్త్‌కేర్ ఆలయాలు ప్రపంచ స్థాయి, సరసమైన, మొట్టమొదటి AI హెల్త్‌కేర్ ఎకోసిస్టమ్‌లుగా రూపొందిస్తున్నామని అదానీ చెప్పారు. ఇంకా వైద్య మౌలిక సదుపాయాలు, పరిశోధనల డిజైన్, వాటి అమలు ప్రసిద్ధ మాయో క్లినిక్ మార్గనిర్దేశంలో ప్రపంచ ప్రమాణాల ప్రకారం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ హెల్త్ కేర్ టెంపుల్స్ మాకు గర్వకారణమని అదానీ అన్నారు.
రాబోయే ఐదు సంవత్సరాలలో దాదాపు రూ. 60వేల కోట్ల మూలధన వ్యయంతో ఇవి సిద్దమవుతాయని అదానీ పేర్కొన్నారు. ఈ పెట్టుబడులు భారతదేశ భవిష్యత్తుకు నిదర్శనమని అన్నారు. వీటి వేగం, వాటి నిబద్ధత భారతదేశ ప్రైవేట్ వైద్య రంగ చరిత్రలో అపూర్వమని అదానీ అన్నారు.
ఇవి కూడా చదవండి
టెన్నిస్ ప్లేయర్ హత్య.. ఈ మ్యూజిక్ వీడియోనే కారణం..
స్టాలిన్‌కు ఈపీఎస్ కౌంటర్.. ముందు మీ అవినీతి గురించి చెప్పండి