ISRO: గగన్‌యాన్ ప్రొపల్షన్ వ్యవస్థ పరీక్ష సక్సెస్
ABN , Publish Date - Jul 13 , 2025 | 03:32 AM
భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ మిషన్‌లో మరో కీలక ముందడుగు పడింది.

బెంగళూరు, జూలై 12: భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ మిషన్‌లో మరో కీలక ముందడుగు పడింది. ఈ ప్రయోగంలో కీలకమైన సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ (ఎస్‌ఎంపీఎస్) విజయవంతంగా అభివృద్ధి చేసినట్లు ఇస్రో శనివారం వెల్లడించింది. దీనికి సంబంధించిన హాట్ టెస్టును శుక్రవారం 350 సెకన్ల పాటు విజయవంతంగా నిర్వహించామని పేర్కొంది. ఎస్‌ఎంపీఎస్ సమగ్ర పనితీరును ధ్రువీకరించుకొనేందుకు తమిళనాడులోని మహేంద్రగిరిలోని ఉన్న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో ఈ పరీక్షలు చేసినట్లు తెలిపింది. గగన్‌యాన్‌కు చెందిన సర్వీస్ మాడ్యూల్ అనేది బై-ప్రొపల్లెంట్ ఆధారిత చోదక వ్యవస్థ. ఇది వ్యోమనౌక అంతరిక్షంలోకి వెళ్లే క్రమంలో ఆర్బిట్ సర్క్యులరైజేషన్, ఆన్-ఆర్బిట్ కంట్రోల్, డీబూస్ట్ మాన్యువరింగ్ వంటి ప్రక్రియల కోసం ఆర్బిటల్ మాడ్యూల్ అవసరాలను తీరుస్తుంది.