Share News

Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం

ABN , Publish Date - Apr 28 , 2025 | 02:04 PM

Pahalgam Terror Attack: పహల్గంలో ఉగ్రదాడి జరిగి 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి జరిగిన అనంతరం తొలిసారిగా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ సోమవారం సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ ఘటనపై స్పందించారు.

Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం
Jammu and Kashmir CM Omar Abdullah

శ్రీనగర్, ఏప్రిల్ 28: పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా జరిగిన దాడికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కత్వా నుంచి కుప్వారా వరకు జరిగిన ఈ ఆందోళనల్లో ప్రతి ఒక్కరు పాల్గొన్నారన్నారు. వీరంతా స్వచ్ఛందంగా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారని ఆయన చెప్పారు. పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ఉగ్ర దాడి ఘటన దేశంపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. గతంలో సైతం ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయని ఈ సందర్భంగా ఆయన సభలో గుర్తు చేశారు.


21 ఏళ్ల తర్వాత బైసరన్‌లో ఈ దాడి జరిగిందన్నారు. జమ్మూ కశ్మీర్‌ వచ్చిన పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపడం తన బాధ్యత అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కానీ తాను ఆ పని చేయ లేకపోయానని సీఎం ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు క్షమాపణలు అడగడానికి తనకు మాటలు రావడం లేదన్నారు. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతోన్నాయని చెప్పారు. ఈ దాడి కారణంగా భారత్, పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయని పేర్కొన్నారు.


ఇక ఈ ఉగ్రదాడిలో పర్యాటకులను రక్షించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన స్థానికుడు సయ్యద్ అదిల్ హుస్సేన్ షా అంశాన్ని ఈ సందర్బంగా సీఎం ఒమర్ అబ్దుల్లా అసెంబ్లీలో ప్రస్తావించారు. పహల్గాంలో ఉగ్రవాదులు.. ఈ దాడి జరిపే సమయంలో మతాన్ని అడిగి వారిపై కాల్పులు జరిపారన్నారు. అయితే ఈ దాడిలో మరణించిన స్థానికుడు, ముస్లిం ఇతను ఒక్కడేనని సీఎం ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

Varanasi: వారణాసిలో కెనడియన్ అరెస్ట్.. ఎందుకంటే..

Hyderabad IT Corridor: బంగ్లాదేశ్ వాసి అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

Pahalgam Terror Attack: పాకిస్థానీ యూట్యూబ్ చానెల్స్‌ను నిషేధించిన భారత్

India Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌కు 4 రోజుల్లో 537 మంది ప్రయాణం

Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా


Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా

Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే

For National News And Telugu News

Updated Date - Apr 28 , 2025 | 02:05 PM