Share News

Shaktikanta Das: మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ-2గా శక్తికాంత దాస్

ABN , Publish Date - Feb 22 , 2025 | 06:27 PM

శక్తికాంత దాస్ భాద్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన నియమాకం అమల్లోకి వస్తుంది. ప్రధానమంత్రి టర్మ్ వరకు కానీ తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది.

Shaktikanta Das: మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ-2గా శక్తికాంత దాస్

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రిన్సిపల్ సెక్రటరీ-2గా నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఆమోదించింది. శక్తికాంత దాస్ భాద్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన నియమాకం అమల్లోకి వస్తుంది. ప్రధానమంత్రి టర్మ్ వరకు కానీ తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. పీకే మిశ్రా 2019 సెప్టెబర్ 11 నుంచి ప్రధానమంత్రికి పర్సనల్ సెక్రటరీగా ఉన్నారు.

DGCA-Air India: విరిగిన సీట్లో మంత్రి ప్రయాణంపై ఏఐని వివరణ కోరిన డీజీసీఏ


ఆరేళ్ల పాటు ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన శక్తికాంత దాస్ గత ఏడాది డిసెంబర్‌లో పదవీ విరమణ చేశారు. దీంతో ఆర్బీఐ 26వ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. 67 ఏళ్ల శక్తికాంత దాస్ 2018లో ఊర్జిత్ పటేల్ అకస్మాత్ముగా రాజీనామాచేయడంలో ఆర్బీఐ గవర్నర్‌ గవర్నర్ బాధ్యతలు చేపట్టారు. 1980 తమిళనాడు ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన దాస్ ఢిల్లీలోని సెయిట్ స్టీఫెన్ కాలేజీలో మాస్టర్ డిగ్రీ చేశారు. బర్మింగ్‌హామ్ యూనివర్శిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు.


2016 నవంబర్‌లో పెద్దనోట్లను రద్దు చేసినప్పుడు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా శక్తికాంతదాస్ ఉన్నారు. 2017 జూలై 1 నుంచి పలు ప్రత్యక్ష పన్నులు జీఎస్‌టీలో విలీనం చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. 2021లో ఆర్బీఐ గవర్నర్‌గా ఆయన పదవికాలం ముగియాల్సి ఉండగా మరో మూడేళ్లు పదవీకాలాన్ని పొడిగించారు.


ఇవి కూడా చదవండి..

Kerala: కేరళలో సంచలనం సృష్టిస్తున్న సామూహిక ఆత్మహత్యలు.. అసలేం జరిగిందంటే..

Delhi: ఛావా ఎఫెక్ట్.. సైన్‌బోర్డులపై బ్లాక్ స్ప్రే, శివాజీ పోస్టర్లు

Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళా ఎఫెక్ట్.. ఫిబ్రవరి 25-28 వరకు ఈ రైళ్లు రద్దు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 22 , 2025 | 06:54 PM