Share News

Sri Ramulu: మాజీ మంత్రి శ్రీరాములు సంచలన కామెంట్స్.. మట్టి తినే దుస్థితికి తెచ్చారు

ABN , Publish Date - Jul 29 , 2025 | 12:59 PM

రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత తీవ్రం అయ్యింది.. అందరికీ అన్నం పెట్టే రైతు కొప్పళ జిల్లాలో మట్టితిన్నాడు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఏడాదిన్నర కాలంలో 980 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ మాజీ మంత్రి శ్రీరాములు ప్రభుత్వంపై మండిపడ్డారు.

Sri Ramulu: మాజీ మంత్రి శ్రీరాములు సంచలన కామెంట్స్.. మట్టి తినే దుస్థితికి తెచ్చారు

- అందరికీ అన్నం పెట్టే రైతులకు ఆకలిచావులు

- యూరియా లేదు.. ఏడాదిన్నరలో 980 మంది ఆత్మహత్య

- సిద్దరామయ్యను మైసూర్‌ ఒడయార్‌తో పోల్చడం సిగ్గుచేటు: మాజీ మంత్రి శ్రీరాములు ధ్వజం

బళ్లారి(బెంగళూరు): రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత తీవ్రం అయ్యింది.. అందరికీ అన్నం పెట్టే రైతు కొప్పళ జిల్లాలో మట్టితిన్నాడు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఏడాదిన్నర కాలంలో 980 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ మాజీ మంత్రి శ్రీరాములు(Sri Ramulu) ప్రభుత్వంపై మండిపడ్డారు. బళ్లారి(Ballari)లోని తన నివాసంలో రైతు సంఘం నాయకులు దరూరు పురుషోత్తమగౌడ, జిల్లా ఫర్టిలైజర్స్‌ యజమానుల సంఘం అధ్యక్షుడు ఐనాత్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోకా అనీల్‌ తదితర బీజేపీ నాయకులతో కలిసి ఆయన విలేకరు సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకున్న రైతులకు కనీసం పరిహారం కూడా ఇవ్వలేదని, మైసూర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విజయోత్సవాలు ఎందుకు జరుపుకుంటుందో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. ఏటా అతివృష్టి, అనావృష్టి లతో అన్నదాత విలవిలలాడు తున్నారన్నారు.


pandu1.2.jpg

రైతులకు యూరియాలు దొరక్క మట్టితింటూ నిరసన వ్యక్తం చేయడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం పంపే యూరియాను రాష్ట్రంల శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు అక్రమంగా పంపిస్తోందని ఆరోపించారు. సిద్దరామయ్య కుమారుడు యతేంద్ర తండ్రిని మైసూర్‌ రాజు ఒడయార్‌తో పోలుస్తూ డబ్బాలు కొట్టుకోవడం సిగ్గు చేటన్నారు. రైతుసంఘ నాయకుడు పురుషోత్తమ గౌడ, ఐనాత్‌రెడ్డి తదితరులు ప్రభుత్వంపై మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌ సహా ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు

ప్రధాని మోదీని బీసీ కాదనడం సిగ్గుచేటు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 29 , 2025 | 12:59 PM