Share News

Iran-Israel: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం ఎఫెక్ట్‌

ABN , Publish Date - Jun 25 , 2025 | 07:24 AM

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య భీకరయుద్ధం నేపథ్యంలో చెన్నై నుంచి అరబ్‌ దేశాలకు వెళ్లాల్సిన పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి.

Iran-Israel: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం ఎఫెక్ట్‌

  • చెన్నై నుంచి 11 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు

  • చెన్నై, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య భీకరయుద్ధం నేపథ్యంలో చెన్నై నుంచి అరబ్‌ దేశాలకు వెళ్లాల్సిన పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. దోహా, అబుధాబీ, కువైట్‌, దుబాయ్‌ దేశాలకు బయలుదేరాల్సిన ఆరు విమానాలతోపాటు, ఆయా దేశాల నుంచి రావాల్సిన ఐదు విమాన సర్వీసులు రద్దయినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, థాయ్‌లాండ్‌ నుంచి దోహాకు వెళుతున్న 3 ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాలు ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా చెన్నైలో ల్యాండయ్యాయి.

Updated Date - Jun 25 , 2025 | 07:24 AM