Share News

Ujjain Temple fire: ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో అగ్నిప్రమాదం.. దర్శనం నిలిపివేత

ABN , Publish Date - May 05 , 2025 | 04:01 PM

అగ్నిమాపక శకటాలు సుమారు 20 నిమిషాల్లో మంటలను అదుపు చేశాయి. ఆలయం సీసీటీవీ కంట్రోల్ రూమ్‌పైన ఉంచిన బ్యాటరీ నుంచి మంటలు వచ్చాయని, బ్యాటరీ తీవ్రంగా వేడెక్కడం, లోపం తలెత్తడంతో మంటలు వచ్చినట్టు తెలుస్తోందని ఆలయ నిర్వహకులు ప్రథమ్ కౌశిక్ తెలిపారు.

Ujjain Temple fire: ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో అగ్నిప్రమాదం.. దర్శనం నిలిపివేత

ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని (Ujjain)లో నెలకొన్ని ప్రపంచ ప్రఖ్యాత మహాకాళేశ్వర్ (Mahakaleshwar) ఆలయంలో సోమవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చెలరేగింది. దట్టమైన పొగలు సుమారు కిలోమీటరు వరకూ వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఆలయ శంఖ ద్వారం, సిసీటీవీ కంట్రోల్ రూమ్‌కు పైనున్న రూఫ్‌ వద్ద మంటలు చెలరేగగా, ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. హుటాహుటిన నాలుగు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. మంటలు పూర్తిగా చల్లారారని, ప్రమాదంలో ఎవరూ మరణించినట్టు సమాచారం లేదని అధికారులు తెలిపారు.

Supreme Court: ఏమిటీ పబ్లిసిటీ స్టంట్?.. టూరిస్టుల భద్రతపై పిల్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు


మంటలకు కారణం ఏమిటి?

అగ్నిమాపక శకటాలు సుమారు 20 నిమిషాల్లో మంటలను అదుపు చేశాయి. ఆలయం సీసీటీవీ కంట్రోల్ రూమ్‌పైన ఉంచిన బ్యాటరీ నుంచి మంటలు వచ్చాయని, బ్యాటరీ తీవ్రంగా వేడెక్కడం, లోపం తలెత్తడంతో మంటలు వచ్చినట్టు తెలుస్తోందని ఆలయ నిర్వహకులు ప్రథమ్ కౌశిక్ తెలిపారు. ఎయిర్ క్వాలిటీ మేనిజేమెంట్ సిస్టం పూర్తిగా ధ్వంసమైనట్టు చెప్పారు. కంట్రోల్ రూమ్ పైన పలు బ్యాటరీలు స్టోర్ చేసినట్టు తెలిపారు.


కొద్దిసేపు దర్శనం నిలిపివేత

అగ్నిప్రమాదం కారణంగా ఆలయ దర్శనాన్ని కొద్ది సేపు నిలిపివేసారు. పరిస్థితి అదుపులోకి వచ్చాక తిరిగి భక్తుల రాకపోకలను అనుమతించారు. కలెక్టర్ రోషన్ కుమార్, ఎస్పీ ప్రదీప్ శర్మ, మహకాళేశ్వర్ టెంపుల్ నిర్వాహకులు ప్రథం కౌసిక్, మున్సిపల్ కమిషనర్ ఆశిష్ పాథక్ తదితరులు ఘటనా స్థలి వద్ద పరిస్థితిని సమీక్షించారు. కంట్రోల్ రూమ్‌లో ప్రమాదం కారణంగా దర్శనాన్ని కొద్దిసేపు నిలివేసి, ఆ తర్వాత పునరుద్ధరించినట్టు కలెక్టర్ చెప్పారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Mughal Descendant: మొఘల్ వారసురాలికి షాక్.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు..

Pahalgam Terror Attack: కశ్మీర్ అడవుల్లోనే.. పహల్గామ్ ఉగ్రవాదులు !

For National News And Telugu News

Updated Date - May 05 , 2025 | 04:09 PM