Share News

Fire Alarm: విమానంలో ఫైర్‌ అలారం..రెక్క పైనుంచి దూకేసిన ప్రయాణికులు

ABN , Publish Date - Jul 06 , 2025 | 02:45 AM

విమానం కొద్ది క్షణాల్లో టేకాఫ్‌ అవుతుందనగా ఫైర్‌ అలారం మోగింది. భయాందోళనతో ప్రయాణికులు ఆగమాగమై విమానం రెక్క పైనుంచి కిందికి దూకేశారు.

Fire Alarm: విమానంలో ఫైర్‌ అలారం..రెక్క పైనుంచి దూకేసిన ప్రయాణికులు

న్యూఢిల్లీ, జూలై 5: విమానం కొద్ది క్షణాల్లో టేకాఫ్‌ అవుతుందనగా ఫైర్‌ అలారం మోగింది. భయాందోళనతో ప్రయాణికులు ఆగమాగమై విమానం రెక్క పైనుంచి కిందికి దూకేశారు. స్పెయిన్‌లోని మయాక ఎయిర్‌పోర్టులో ఇది జరిగింది. ఈ ఘటనలో 18 మంది గాయపడ్డారు. స్పెయిన్‌లోని పాల్మా డే మయాక నుంచి ఈ నెల 4న ర్యాన్‌ ఎయిర్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం మాంచెస్టర్‌కు వెళ్లేందుకు సిద్ధమైంది. ఇంతలో విమానంలో అగ్నిప్రమాద హెచ్చరికగా అలారం మోగింది.


వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు విమానంలోకి వచ్చి ఎమర్జెన్సీ ద్వారం గుండా ప్రయాణికులను బయటకు పంపే ఏర్పాట్లు ప్రారంభించారు. కానీ, కొందరు భయంతో విమానం రెక్క మీద నుంచి దూకేశారు. ఇదిలా ఉండగా, విమానంలో అగ్నిప్రమాదం ఏమీ జరగలేదని, అలారం పొరపాటున మోగిందని ఆ తర్వాత సిబ్బంది చెప్పారు.

Updated Date - Jul 06 , 2025 | 02:45 AM