Nitin Gadkari: ఇప్పుటివరకూ న్యూస్‌రీల్ చూశారు, సినిమా ముందుంది
ABN , Publish Date - Jun 21 , 2025 | 09:40 PM
తలసరి ఆదాయం విషయంలో ప్రపంచంలోని తొలి 10 దేశాల్లో భారత్ ఎందుకు లేదని అడిగిన ప్రశ్నకు దేశ జనాభానే కారణమని నితిన్ గడ్కరి జవాబిచ్చారు. జనాభా నియంత్రణను ఆర్థిక సమస్యగా చూడాలని, భాష, మతపరమైన సమస్యగా చూడరాదని సూచించారు.

నాగపూర్: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి (Nitin Gadkari) శనివారంనాడిక్కడ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పాత్రపై అడిగినప్పుడు.. గత 11 ఏళ్లలో చూసింది న్యూస్ రీల్ మాత్రమేనని, అసలైన సినిమా ఇంకా మిగిలే ఉందని నవ్వుతూ సమాధానమిచ్చారు. పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా పని చేస్తానని చెప్పారు. తన పొలిటికల్ బయోడాను ఎప్పుడూ పబ్లిష్ చేసుకోలేదని, విమానాశ్రయంలో గ్రాండ్ వెల్కమ్ ఈవెంట్లు నిర్వహించమని తన మద్దతుదారులను ఎప్పుడూ కోరలేదని చెప్పారు.
'ఇటీవల రోడ్డు పనుల కంటే వ్యవసాయం, ఇతర సామాజిక కార్యక్రమాలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నాను' అని నితిన్ గడ్కరి తెలిపారు. విదర్భలో రైతుల ఆత్యహత్యలు ఆపేందుకు కృషి చేయాలన్నదే తన కోరికని అని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
తలసరి ఆదాయం విషయంలో ప్రపంచంలోని తొలి 10 దేశాల్లో భారత్ ఎందుకు లేదని అడిగిన ప్రశ్నకు దేశ జనాభానే కారణమని జవాబిచ్చారు. జనాభా నియంత్రణను ఆర్థిక సమస్యగా చూడాలని, భాష, మతపరమైన సమస్యగా చూడరాదని సూచించారు. చాలా అభివృద్ధి జరుగుతున్నప్పటికీ ఫలితాలు అందరికీ చేరడం లేదని, పెరిగిపోతున్న జనాభానే ఇందుకు కారణమని చెప్పారు. శివసేన నేత సుధాకర్ బడ్‌గుజర్ బీజేపీలో చేరడంపై అడిగినప్పుడు ఆయన ఎవరో తనకు తెలియదని, ఎప్పుడూ అతన్ని కలవలేదని గడ్కరి సమాధానమిచ్చారు. 2014 నుంచి పదకొండేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం పలు విజయాలు సాధించిందని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ నుంచి 310 మంది భారతీయులతో ఢిల్లీ చేరిన మరో విమానం
సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించం...తేల్చిచెప్పిన అమిత్‌షా
For National News And Telugu News