Share News

Farooq Abdullah: రెండు దేశాల సిద్ధాంతాన్ని ఆరోజే తిప్పికొట్టాం.. పాక్‌కు ఫరూక్ ఝలక్

ABN , Publish Date - Apr 28 , 2025 | 04:44 PM

పాక్ సైన్యాధిపతి ఆసిం మునీర్ భారత్‌పై విషం కక్కుతూ ఇటీవల రెండు దేశాల సిద్ధాంతాన్ని ప్రస్తావించిన నేపథ్యంలో ఫరూక్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Farooq Abdullah: రెండు దేశాల సిద్ధాంతాన్ని ఆరోజే తిప్పికొట్టాం.. పాక్‌కు ఫరూక్ ఝలక్

శ్రీనగర్: హహల్గాం ఉగ్రదాడిపై కశ్మీర్‌తో పాటు యావద్దేశం మండిపడుతోంది. ఉగ్రవాదానికి మూలకేంద్రమైన పాక్ దుశ్చర్యను ఎండగడుతూ భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. పాక్ సైతం భారత్ నిర్ణయాలకు ప్రతీకార నిర్ణయాలతో తెగబడుతోంది. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చైర్మన్ ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) పాక్‌కు గట్టి జవాబిచ్చారు. రెండు దేశాల సిద్ధాంతాన్ని (Two-nation theory) కశ్మీరీలు 1947లోనే తోసిపుచ్చారని గుర్తు చేశారు. జమ్మూకశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్‌తో వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పాక్ సైన్యాధిపతి ఆసిం మునీర్ భారత్‌పై విషం కక్కుతూ ఇటీవల రెండు దేశాల సిద్ధాంతాన్ని ప్రస్తావించిన నేపథ్యంలో ఫరూక్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Tahawwur Rana: పాటియాలా కోర్టుకు తహవ్వుర్ రాణా.. 12 రోజుల కస్టడీ కోరిన ఎన్ఐఏ


ఉగ్రదాడులకు బుద్ధి చెప్పాల్సిందే..

''పాకిస్థాన్‌తో చర్చలకు ప్రతిసారి నేను సముఖత వ్యక్తం చేస్తూ వచ్చాను. అయితే ఉగ్రదాడిలో తమ ప్రియతములను కోల్పోయిన వారికి ఏమి సమాధానం చెబుతాం? ఇది న్యాయం చేసినట్టు అవుతుందా? దీనికి ప్రతీకారం చేసితీరాలని యావద్దేశం ఇవాళ చెబుతోంది. అప్పుడే ఇలాంటి దాడులు పునరావృతం కావు" అని ఫరూక్ అబ్దుల్లా సోమవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. రెండు దేశాల సిద్ధాంతంపై మాట్లాడుతూ, 1947లోనే రెండు దేశాల సిద్ధాంతాన్ని జమ్మూకశ్మీర్ ప్రజలు తోసిపుచ్చారని, ఇప్పటికి కూడా అందుకు సిద్ధంగా లేరని పాక్‌కు గట్టి బదులిచ్చారు.


అప్పుడే మీతో రాలేదు.. ఇప్పుడు వస్తామా?

పహల్గాం ఉగ్రదాడి మానవత్వంపై జరిగిన దాడి అని, ఆ విషయాన్ని పాక్ అర్ధం చేసుకోకపోవడం విచారకరమని ఫరూక్ అన్నారు. ''మానవత్వంపై దాడి చేస్తే పాక్‌కు మేమంతా వంతపాడుతామనుకుంటే అది కశ్మీర్ ప్రజలను తప్పుగా అర్ధం చేసుకున్నట్టే. 1947లోనే మేము వాళ్లతో (పాక్‌తో) వెళ్లలేదు. ఇప్పుడు ఎందుకు వెళ్తాం? అప్పట్లోనే రెండు దేశాల సిద్ధాంతాన్ని తోసిపుచ్చాం. ఇప్పుడు కూడా ఆ థియరీని అంగీకరించే ప్రసక్తి లేదు. మేము వాళ్లకు గట్టి జవాబిస్తాం'' అని దాయాది దేశానికి ఆయన గట్టి సందేశం ఇచ్చారు.


ఆసిం మునీర్ అక్కసు..

పహల్గాంలో ముష్కరుల పాశవిక దాడుల అనంతరం పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. అన్ని అంశాల్లో హిందూ, ముస్లింలు వేర్వేరని అన్నారు. వీటి ఆధారంగా రెండు దేశాలు ఉండాలనే భావన ఏర్పడిందన్నారు. పాకిస్థాన్ ఏర్పాటుకు పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేశారన్నారు. కశ్మీర్ తమ జీవనాడి లాంటిదని వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి..

PM Modi: ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 40 నిమిషాల భేటీ..ఏం చర్చించారంటే..

Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం

For National News And Telugu News

Updated Date - Apr 28 , 2025 | 04:45 PM