Share News

భారత్‌లో ఫాల్కన్‌ వాణిజ్య జెట్ల తయారీ

ABN , Publish Date - Jun 19 , 2025 | 03:11 AM

అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, ఫ్రాన్స్‌కు చెందిన దసో ఏవియేషన్‌ సంస్థ సంయుక్తంగా బిజినెస్‌ జెట్‌ విమానాల నిర్మాణం చేపట్టనున్నాయి.

భారత్‌లో ఫాల్కన్‌ వాణిజ్య జెట్ల తయారీ

రిలయన్స్‌ ఇన్‌ఫ్రా-దసో మధ్య కీలక ఒప్పందం

పారిస్‌, న్యూఢిల్లీ, జూన్‌ 18: అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, ఫ్రాన్స్‌కు చెందిన దసో ఏవియేషన్‌ సంస్థ సంయుక్తంగా బిజినెస్‌ జెట్‌ విమానాల నిర్మాణం చేపట్టనున్నాయి. ఫాల్కన్‌-2000 జెట్లను తొలిసారి ఫ్రాన్స్‌కు బయట ఉత్పత్తి చేయనున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వీటి నిర్మాణం జరగనుంది. రెండు కంపెనీల మధ్య జాయింట్‌ వెంచర్‌ 2017లోనే కుదరగా పారి్‌సలో తాజా కీలక ఒప్పందం కుదిరింది. ఇప్పటివరకు అమెరికా, ఫ్రాన్స్‌, కెనడా, బ్రెజిల్‌ మాత్రమే బిజినెస్‌ జెట్‌ విమానాల నిర్మాణం చేస్తుండగా ప్రస్తుతం ఐదో దేశంగా భారత్‌ నిలవనుంది. రెండు ఇంజిన్లుండే ఫాల్కన్‌-2000 బిజినెస్‌ జెట్‌లో 8 నుంచి పది మంది ప్యాసింజర్లు ప్రయాణించవచ్చు. దసో ఏవియేషన్‌ సంస్థ ఇప్పటివరకు 2700 ఫాల్కన్‌లతో పాటు మొత్తం 10 వేల సైనిక, పౌర విమానాలను 90 దేశాలకు సరఫరా చేసింది. భారత్‌లో తొలి ఫాల్కన్‌-2000 జెట్‌ విమానం 2028 నాటికి సిద్ధం కావొచ్చని అంచనా. ఇందుకోసం వందల మంది ఇంజినీర్లను, టెక్నీషియన్లను రిక్రూట్‌ చేసుకోనున్నారు.

Updated Date - Jun 19 , 2025 | 03:11 AM