Share News

Report On Covid Vaccine: గుండెపోటు మరణాలు.. కొవిడ్ వ్యాక్సిన్‌.. తేల్చిచెప్పిన నివేదిక..

ABN , Publish Date - Jul 05 , 2025 | 07:38 PM

కొవిడ్ వ్యాక్సిన్‌కు, గుండెపోటు మరణాలకు ఏదైనా సంబంధం ఉందా? అనే విషయాన్ని తేల్చడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. తాజాగా నిపుణుల కమిటీ అధ్యయనం పూర్తి చేసింది. అధ్యయనంలో తేలిన విషయాన్ని వెల్లడించింది.

Report On Covid Vaccine: గుండెపోటు మరణాలు.. కొవిడ్ వ్యాక్సిన్‌.. తేల్చిచెప్పిన నివేదిక..

బెంగళూరు: నెలరోజుల్లో 20 మందికి పైగా యువకులు గుండెపోటుతో మరణించడానికి కొవిడ్ వ్యాక్సిన్ కారణం కావచ్చనే అనుమానాలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల వ్యక్తం చేశారు. దీంతో కొవిడ్ వ్యాక్సిన్‌కు, గుండెపోటు మరణాలకు ఏదైనా సంబంధం ఉందా? అనే విషయాన్ని తేల్చడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. తాజాగా నిపుణుల కమిటీ అధ్యయనం పూర్తి చేసింది. అధ్యయనంలో తేలిన విషయాన్ని వెల్లడించింది. ఆకస్మిక మరణాలకు, కొవిడ్ టీకాలకు సంబంధం లేదని స్పష్టం చేసింది. యువకుల ఆకస్మిక గుండెపోటు మరణాలకు 'లాంగ్ కొవిడ్' కారణం కావచ్చడనానికి ప్రస్తుత గణాంకాలు ఏమాత్రం సపోర్ట్ చేయడం లేదని తెలిపింది.


'కొవిడ్ ఫేజ్ ముగిసిన వెంటనే ఆకస్మిక గుండెపోటు మరణాలు పెరిగాయి. అయితే కొవిడ్ ముగిసిన సుదీర్ఘ కాలం తర్వాత ఈ తరహా మరణాల్లో ఎంత మాత్రం నిజం లేదు. కొవిడ్ మహమ్మారి ముగిసి మూడేళ్లయింది' అని ఆ నివేదిక పేర్కొంది.


కొవిడ్‌‌కు, ఆకస్మిక గుండెపోటు మరణాల మధ్య ఎలాంటి సంబంధమైనా ఉందా? అనే అంశంపై అవగాహనకు ప్రపంచవ్యాప్తంగా ప్రచురితమైన పలు రీసెర్చ్ పేపర్లను తాము అధ్యయనం చేసినట్టు నిపుణుల కమిటీ తెలిపింది. అయితే, చాలామటుకు అధ్యయనాలు కొవిడ్ వ్యాక్సిన్‌కూ, ఆకస్మిక గుండెపోటు మరణాలకు సంబంధం లేదని తేల్చినట్టు పేర్కొంది. నిజానికి దీర్ఘకాలంలో గుండెపోటు మరణాలు సంభవించకుండా కొవిడ్ వ్యాక్సిన్‌ నుంచి రక్షణ లభిస్తున్నట్టు తమ పరిశీలనలో తేలిందని చెప్పింది.


ఈ అధ్యయనం కోసం నిపుణుల కమిటీ 45 ఏళ్ల లోపు వయసున్న 251మంది పేషెంట్లను అబ్జర్వ్ చేసింది. వీరంతా శ్రీజయదేవ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియో వాసిక్యులర్ సైన్సెస్‌లో ప్రస్తుతం హృద్రోగ సమస్యలు ఎదుర్కొంటున్నారు. 2025 ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకూ ఈ అధ్యయనం సాగించింది. ఈ డేటాను ఇదే తరహాలో 2019 ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకూ జరిపిన అధ్యయనంతో కూడా సరిపోల్చింది.


ఇవి కూడా చదవండి..

ఆ క్రెడిట్ నాకు ఇచ్చినందుకు థాంక్స్... ఠాక్రే సోదరుల కలయికపై సీఎం

ప్రముఖ వ్యాపారి కాల్చివేత.. శాంతిభద్రతలపై సీఎం సమీక్ష

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 05 , 2025 | 08:01 PM