Share News

Mumbai: కారు ఢీకొనడంతో శివసేన మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలు.. ప్రమాదంపై అనుమానాలు

ABN , Publish Date - Nov 25 , 2025 | 09:48 PM

ప్రాథమిక సమాచారం ప్రకారం, నిర్మలా గావిత్ సోమవారం సాయంత్రం నాసిక్‌లోని తన నివాసం వెలుపల వాకింగ్ చేస్తుండగా వేగంగా దూసుకువచ్చిన కారు వెనక వైపు నుంచి ఢీకొంది.

Mumbai: కారు ఢీకొనడంతో శివసేన మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలు.. ప్రమాదంపై అనుమానాలు
Nirmala gavit

ముంబై: వేగంగా వస్తున్న కారు వెనుక నుంచి ఢీకొనడంతో శివసేన షిండే వర్గం మాజీ ఎమ్మెల్యే నిర్మలా గావిత్ (Nirmala Gavit) తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను సమీప ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన సీసీటీవీలో నమోదు కావడంతో ఇది ప్రమాదమా, ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఈ పని చేశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి స్థాయి విచారణ తర్వాతే కారణాలను నిర్ధారించగలమని పోలీసులు తెలిపారు.


ప్రాథమిక సమాచారం ప్రకారం, నిర్మలా గావిత్ సోమవారం సాయంత్రం నాసిక్‌లోని తన నివాసం వెలుపల వాకింగ్ చేస్తుండగా వేగంగా దూసుకువచ్చిన కారు వెనక వైపు నుంచి ఢీకొంది. డ్రైవర్ కారు ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని కారు, పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.


ఎవరీ నిర్మలా గావిత్

కేంద్ర మాజీ మంత్రి మానిక్‌రావు గావిత్ కుమార్తె అయిన నిర్మలా గావిత్‌ కూడా రాజకీయాల్లో మంచిపేరు తెచ్చుకున్నారు. రెండుసార్లు ఇగత్‌పురి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో కాంగ్రెస్‌ను వీడి శివసేన (ఉద్ధవ్)లో చేరారు. అయితే 2025 మే 28న ఆమె ఏక్‌నాథ్ షిండే శివసేనలో చేరారు.


ఇవి కూడా చదవండి..

ఎందరో త్యాగధనుల కలలు నేటితో సాకారం.. ఆర్ఎస్ఎస్ చీఫ్

రామభక్తుల సంకల్పం సిద్ధించింది: ప్రధాని మోదీ

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Nov 25 , 2025 | 09:49 PM