Share News

EPS: రాష్ట్రంలో.. ఇప్పటివరకు 20 పరువు హత్యలు

ABN , Publish Date - Jul 31 , 2025 | 11:35 AM

డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతల కారణంగా ఇప్పటివరకు 20 పరువు హత్యలు జరిగాయని, ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోయిందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఆరోపించారు.

EPS: రాష్ట్రంలో.. ఇప్పటివరకు 20 పరువు హత్యలు

- డీఎంకే పాలనలోనే ఈ ఘటనలు అధికం

చెన్నై: డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతల కారణంగా ఇప్పటివరకు 20 పరువు హత్యలు జరిగాయని, ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోయిందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) ఆరోపించారు. శివగంగ జిల్లాలో రెండో విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఈపీఎస్‌ బుధవారం ఉదయం శివగంగ జిల్లా మడపురం ఆలయ వాచ్‌మన్‌గా పనిచేస్తూ లాక్‌పడెత్‌కు గురైన అజిత్‌కుమార్‌ నివాసానికి వెళ్ళారు.


అక్కడ అజిత్‌కుమార్‌ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం అజిత్‌కుమార్‌ తల్లి, సోదరుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఈపీఎస్‌ మీడియాతో మాట్లాడుతూ, ఏ నేరం చేయని అజిత్‌కుమార్‌ను అన్యాయంగా లాక్‌పడెత్‌ చేసిన పోలీసుల వైఖరిని ఖండిస్తూ అన్నాడీఎంకే తరుఫున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ధర్నాలు నిర్వహించినట్లు తెలిపారు. 2021లో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు రక్షణ కరువైందని, శాంతిభద్రలను కాపాడటంలో పోలీసుశాఖ విఫలమైందన్నారు.


అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటయ్యాక అజిత్‌కుమార్‌ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చిన ఈపీఎస్‌ ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థికసాయాన్ని అందజేశారు. ఆ తర్వాత కీళడి ప్రాంతంలోవున్న పరిశోధన కేంద్రాన్ని మాజీమంత్రులు సెల్లూరు రాజు, డాక్టర్‌ సి.విజయ్‌భాస్కర్‌, పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఈపీఎస్‌ మీడియాతో మాట్లాడుతూ 2014వ సంవత్సరం ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జయలలిత కీళడి తవ్వకాలకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు.


city5.2.jpg

2015 నుంచి 2015 వరకు పరిశోధకులు అమర్‌నాథ్‌ రామకృష్ణన్‌ మూడు విడతల పరిశోధన చేశారని, ఆ తర్వాత కేంద్రప్రభుత్వం నుంచి అనుమతి పొంది, 2018లో రాష్ట్ర పురావస్తుశాఖ నేతృత్వంలో 2019 వరకు నిర్వహించిన తవ్వకాల్లో అరుదైన పురాతన కళాకండాలు లభ్యమయ్యాయని, వాటిని అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న పరిశోధనశాలకు పంపించామని వివరించారు. అమెరికాలోని చికాగోలో నిర్వహించిన ప్రపంచ తమిళ మహానాడులో ‘కీళడి ఎంతాయ్‌ మడి’ అనే పేరిట ఏర్పాటు చేసి మొట్టమొదటి సారిగా ప్రదర్శన ఏర్పాటు చేసి కీళడి ఘనతను ప్రపంచస్థాయికి తీసుకెళ్లామన్నా రు.


2020వ సంవత్సరం నగరంలో జరిగిన 43 పుస్తక ప్రదర్శనలో కీళడి తవ్వకాల విశిష్టతను రాష్ట్రప్రజలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ప్రత్యేకస్టాళ్లు ఏర్పాటు చేశా మని, రాష్ట్రంలో నిర్వహించిన 39 పురావస్తు పరిశోధనల్లో 33 అన్నాడీఎంకే ప్రభుత్వంలో నిర్వహించినవని తెలిపారు. ప్రస్తుతం కీళడి పేరుతో కొంతమంది రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వాస్తవాలను మరుగుపరిచిన సీఎం స్టాలిన్‌ ప్రభుత్వం కీళడి పరిశోధనలు తమవల్లేనని ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చారిత్రాత్మకమైన కీళడి పరిశోధనలకు మరింత ఘనత చేకూర్చేలా ఆ నివేదికకు కేంద్రప్రభుత్వం అంగీకరించాలని విజ్ఞప్తి చేసిన ఈపీఎస్‌ ఈ నాలుగేళ్ళ డీఎంకే పాలనలో అన్నిశాఖల్లో అభివృద్ధి కుంటుపడిందని వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ లక్షదాటేసిన పసిడి ధరలు

ఉపాధి హామీ ఫీల్డ్‌అసిస్టెంట్లకు సమాన వేతనం

Read Latest Telangana News and National News

Updated Date - Jul 31 , 2025 | 11:37 AM