Share News

Revenge After Lover Marries: ప్రియుడి పేరుతో 12 రాష్ట్రాలకు బాంబు బెదిరింపులు

ABN , Publish Date - Jun 25 , 2025 | 07:13 AM

తాను ప్రేమించిన వ్యక్తి మరో అమ్మాయిని వివాహం చేసుకోవడాన్ని భరించలేని ఓ మహిళా ఇంజనీర్‌ ప్రియుడిపై కక్ష గట్టింది.

Revenge After Lover Marries: ప్రియుడి పేరుతో 12 రాష్ట్రాలకు బాంబు బెదిరింపులు

  • మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని కక్ష

అహ్మదాబాద్‌, జూన్‌ 24: తాను ప్రేమించిన వ్యక్తి మరో అమ్మాయిని వివాహం చేసుకోవడాన్ని భరించలేని ఓ మహిళా ఇంజనీర్‌ ప్రియుడిపై కక్ష గట్టింది. తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో అతన్ని ఇరికించేందుకు ప్రియుడి పేరిట ఫేక్‌ ఈమెయిల్‌ ఐడీలు సృష్టించి, వీపీఎన్‌లు, డార్క్‌వెబ్‌ను ఉపయోగించి.. అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంతో పాటు తెలంగాణ, కర్ణాటక సహా 12 రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు బాంబు బెదిరింపులు పంపింది. ఒక్క గుజరాత్‌కే 21 బెదిరింపులు వెళ్లాయి. దీనిపై ఈనెల 3న వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిపిన అహ్మదాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుట్టు రట్టు చేశారు. రెనే జోషిల్దాను చెన్నైలో అరెస్టు చేశారు. ఆమె వన్‌ సైడ్‌గా ప్రేమించిన యువకుడి పేరు దివిజ్‌ ప్రభాకర్‌. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే ఫిబ్రవరిలో ప్రభాకర్‌ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో జోషిల్దా కల చెదిరింది.

Updated Date - Jun 25 , 2025 | 07:13 AM