Share News

Elephants: కొడైకెనాల్‌లో అధికమైన ఏనుగుల సంచారం

ABN , Publish Date - Jun 28 , 2025 | 11:14 AM

ఏనుగుల గుంపు సంచరిస్తున్న కారణంగా ప్రముఖ వేసవి విడిది కొడైకెనాల్‌లో పర్యాటక ప్రాంతాల సందర్శనపై జిల్లా యంత్రాంగం నిషేధం విధించింది. దిండుగల్‌ జిల్లా కొడైకెనాల్‌ చుట్టు పక్కల దట్టమైన అడవులున్నాయి.

Elephants: కొడైకెనాల్‌లో అధికమైన ఏనుగుల సంచారం

- పర్యాటక ప్రాంతాల సందర్శనపై నిషేధం

చెన్నై: ఏనుగుల గుంపు సంచరిస్తున్న కారణంగా ప్రముఖ వేసవి విడిది కొడైకెనాల్‌లో పర్యాటక ప్రాంతాల సందర్శనపై జిల్లా యంత్రాంగం నిషేధం విధించింది. దిండుగల్‌(Dindigal) జిల్లా కొడైకెనాల్‌ చుట్టు పక్కల దట్టమైన అడవులున్నాయి. అడవుల నుంచి వెలుపలికి వచ్చిన ఏనుగుల గుంపు పర్యాటకులు అధికంగా సందర్శించే బేరిజం చెరువులో మకాం వేశాయి. దీంతో పర్యాటకులు ఏనుగుల దాడికి గురికాకుండా తగు భద్రతా చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లా యంత్రాంగం అటవీశాఖకు ఉత్తర్వులు జారీ చేసింది.


nani2.2.jpg

దీంతో అటవీశాఖ ఆధీనంలో ఉన్న గుణ గుహలు, మేయర్‌ స్తూపం, పైన్‌ట్రీస్ రోడ్డు, పిల్లర్‌రాక్‌, బేరిజం చెరువు తదితర ప్రాంతాలను మూసివేశారు. ఈ ప్రాంతాలను పర్యాటకులు సందర్శించకుండా అటవీశాఖ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. కాగా, కొడైకెనాల్‌లోని బోట్‌హౌస్‌, కోకర్స్‌వాక్‌, సెయింట్‌ మేరీ చర్చీ, పంపార్‌ జలపాతం, గ్రీన్‌వ్యాలీ వ్యూ, కురింజి ఆండవర్‌ ఆలయం తదితర ప్రాంతాల్లో పర్యాటకుల సందడి నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం ధర భారీగా తగ్గిందోచ్, కానీ వెండి మాత్రం

ఆర్‌అండ్‌బీలో 72 మంది డీఈఈలకు పదోన్నతి

Read Latest Telangana News and National News

Updated Date - Jun 28 , 2025 | 11:14 AM