Share News

CEC: ఓటర్ల జాబితాపై సీఈసీ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 11 , 2025 | 09:36 PM

చట్టప్రకారం ప్రతి ఏడాది ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరుగుతుందని, ఎన్నికలకు ముందు ఆయా రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలకు జాబితాను అందజేస్తామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ చెప్పారు.

CEC: ఓటర్ల జాబితాపై సీఈసీ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: భారతదేశంలో ఓటర్ల జాబితా రూపకల్పన అనేది ప్రపంచంలోని అత్యంత పకడ్బందీ, పారదర్శకమైన ప్రక్రియల్లో ఒకటని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) తెలిపారు. చట్టప్రకారం ప్రతి ఏడాది ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరుగుతుందని, ఎన్నికలకు ముందు ఆయా రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలకు జాబితాను అందజేస్తామని చెప్పారు. ఎన్నికల సమగ్రతపై స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో సీఈసీ కీలకోపన్యాసం చేస్తూ, 1960 నుంచి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఓటర్ల జాబితాను షేర్ చేసుకుంటున్నట్టు చెప్పారు. దానిపై క్లెయిమ్స్, అభ్యంతరాలు, అప్పీల్‌కు అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. ఎన్నికల్లో రిగ్గింగ్ కోసం ఓటర్ల జాబాతాలో అవకతవకలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ సహా విపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సీఈసీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


ఎన్నికల ప్రక్రియ మొత్తం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు, పోలీసులు, ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్లు, మీడియా నిరంతరం పర్యవేక్షిస్తుంటారని సీఈసీ చెప్పారు. పోలింగ్ సిబ్బంది, పోలీసు బలగాలు, అబ్జర్వర్లు, రాజకీయ పార్టీల ఏజెంట్లతో సహా 2 కోట్ల మందికి పైగా సిబ్బందితో ఎన్నికల కమిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా నిలుస్తోందన్నారు. ఇందువల్లే సుమారు 100 కోట్ల మంది ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోగలుగుతున్నాయని చెప్పారు.


కాగా, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్‌తోనే గెలుస్తోందని, ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిందిదేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల ఆరోపించారు. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మ్యాచ్ ఫిక్సింగ్‌ పునరావృతం కానున్నదని అన్నారు. ఈ ఆరోపణలను ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. లిఖిత పూర్వక ఫిర్యాదు చేస్తే స్పందించగలమని తెలిపింది. బీజేపీ సైతం కాంగ్రెస్‌ను తప్పుపడుతూ, ఓటమి ఎదురైన ప్రతిసారీ ఇలాంటి ఆరోపణలు చేయడం ఆ పార్టీకి పరిపాటైందని విమర్శించింది.


భర్తను చంపడాన్ని కళ్లారా చూసిన సోనమ్ రఘువంశీ

రాజాతో పెళ్లి.. తల్లికి ముందే వార్నింగ్ ఇచ్చిన సోనమ్..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 11 , 2025 | 09:51 PM