Share News

Eknath Shinde Teases Pawar: అజిత్ దాదా కుర్చీ ఫిక్స్.. మీడియా సంయుక్త సమావేశంలో షిండే ఛలోక్తులు

ABN , Publish Date - Mar 02 , 2025 | 09:44 PM

మహారాష్ట్ర బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. 2025-2026 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను మార్చి 10న అసెంబ్లీలో ప్రవేశపెడతారు. గత వర్షాకాల సమావేశం మంత్రుల ప్రమాణస్వీకారం లేకుండా నాగపూర్‌లో జరుగగా, ఈసారి పూర్తి స్థాయి సెషన్ ముంబైలో జరుగనుంది.

Eknath Shinde Teases Pawar: అజిత్ దాదా కుర్చీ ఫిక్స్.. మీడియా సంయుక్త సమావేశంలో షిండే ఛలోక్తులు

మహారాష్ట్ర: బడ్జెట్ సమావేశాలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉపముఖ్యమంత్రులు ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ సంయుక్తంగా ఆదివారంనాడు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంల మధ్య కాసేపు సరస సంభాషణలు చోటుచేసుకున్నారు. దీంతో అక్కడ నవ్వులు వెల్లివిరిసారు.

Delhi Mahila Samriddhi Yojana: మహిళలకు రూ.2,500 సాయం.. 8 నుంచి రిజస్ట్రేషన్


తొలుత అజిత్ పవార్‌ను షిండే టీజ్ చేశారు. ''ఫడ్నవిస్, నేనూ కుర్చీలు (ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి) మార్చుకున్నాం. అజిత్ దాదా మాత్రం కుర్చీని (ఉప ముఖ్యమంత్రి పదవిని) ఫిక్స్ చేసుకున్నారు'' అని చలోక్తులు విసిరారు. ఇందుకు అంతే నేర్పుగా అజిత్ పవార్ సమాధానమిచ్చారు. ''మీరు మీ కుర్చీని ఫిక్స్ చేసుకోలేరు'' అంటూ నవ్వేశారు.


మహారాష్ట్ర బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. 2025-2026 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను మార్చి 10న అసెంబ్లీలో ప్రవేశపెడతారు. గత వర్షాకాల సమావేశం మంత్రుల ప్రమాణస్వీకారం లేకుండా నాగపూర్‌లో జరుగగా, ఈసారి పూర్తి స్థాయి సెషన్ ముంబైలో జరుగనుంది.


కోల్డ్‌వార్..?

బడ్జెట్ సమావేశానికి ముందు ఏర్పాటు చేసిన సమాశానికి విపక్షాలు హాజరుకాలేదని, ఒక లేఖ మాత్రం రాసారని, సభ సజావుగా సాగేందుకు తాము కృతనిశ్చయంతో ఉన్నామని ఈ సందర్భంగా అజిత్ పవార్ చెప్పారు. ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ, తమ ప్రభుత్వం నిర్వహిస్తున్న రెండో సెషన్ ఇదని చెప్పారు. మేమిద్దరం (ఫడ్నవిస్, షిండే) సీట్లు మార్చుకున్నప్పటికీ, అజిత్ దాదా సీటు మాత్రం పదిలంగా ఉందని అన్నారు. మహారాష్ట్ర బడ్జెట్‌ను అజిత్ దాదా ప్రవేశపెడుతున్నారని, ఎన్ని బ్రేకింగ్ న్యూస్ మీరు (మీడియా) ఇస్తారో చూడాలని చమత్కరించారు. మహాయుతి మాత్రం 'బ్రేక్' కాలేదని అన్నారు. కోల్డ్‌వార్ అనేదే లేదని చెప్పారు. మహారాష్ట్రలో ఎండలు మండటం మొదలుపెట్టినప్పుడు కోల్డ్‌వార్‌కు అవకాశం ఎక్కడుందని నవ్వుతూ ప్రశ్నించారు. బడ్జెట్ సెషన్‌కు ముందు ఏర్పాటు చేసిన సమావేశానికి విపక్షాలు హాజరుకాని విషయాన్ని సీఎం ఫడ్నవిస్ ప్రస్తావిస్తూ, విపక్షాల పరిస్థితి 'హమ్ సాథ్ సాథ్ హై' తరహాలో కాకుండా 'హమ్ ఆప్కే హై కౌన్?'లా ఉందని చమత్కరించారు. సభలో విపక్షాలు ఎక్కువ సేపు మాట్లాడేందుకు తాము అవకాశమిస్తామని చెప్పారు.


ఇవి కూడా చదవండి

Mayawati: నేనున్నంత వరకూ నాకు వారసులు ఉండరు: మాయావతి బిగ్ స్టేట్‌మెంట్

PM Modi: 100 జిల్లాల్లో పీఎం ధన ధాన్య కృషి

Privilege Motion: జైశంకర్‌పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 02 , 2025 | 09:45 PM