Share News

ED Team Attacked: మాజీ సీఎం నివాసంలో సోదాలు చేసిన ఈడీ టీమ్‌పై దాడి

ABN , Publish Date - Mar 10 , 2025 | 08:58 PM

ఛత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో 15 ప్రాంగణాల్లో ఈడీ సోమవారంనాడు సోదాలు జరిపింది. వాటిలో భిలాయి ప్రాంతంలో ఉన్న భూపేశ్ భగేల్ కుమారుడు చైతన్య భగేల్ నివాసం కూడా ఉంది.

ED Team Attacked: మాజీ సీఎం నివాసంలో సోదాలు చేసిన ఈడీ టీమ్‌పై దాడి

రాయపూర్: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ (Bhupesh Baghel) నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఛత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో 15 ప్రాంగణాల్లో ఈడీ సోమవారంనాడు సోదాలు జరిపింది. వాటిలో భిలాయి ప్రాంతంలో ఉన్న భూపేశ్ భగేల్ కుమారుడు చైతన్య భగేల్ నివాసం కూడా ఉంది.

NEP Row: మేము అనాగరికులమా?.. ధర్మేంద్ర ప్రధాన్‌పై కనిమొళి ప్రివిలిజ్ నోటీసు


భగేల్ కార్యాలయం ఈ దాడులపై స్పందిస్తూ, ఏడేళ్ల సాగిన ఈ తప్పుడు కేసును కోర్టు కొట్టేసిందని, అయినప్పటికీ ఈడీ అతిథులు ఇప్పుడు భగేల్ నివాసంలో తనిఖీలు చేశారని మండిపడింది. అప్పట్లో ఛత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణంలో రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని, మద్యం సిండికేట్‌కు రూ.2,000 కోట్లు లబ్ధి చేకూరిందని ఈడీ వాదనగా ఉంది. ఈ క్రమంలో ఈడీ సోమవారంనాడు తిరిగి సోదాలు నిర్వహించడం సంచలనమైంది.


దాడి కాంగ్రెస్ వర్కర్ల పనే

కాగా, భగేల్ నివాసాల్లో సోదాలు జరపడంతో మనస్తాపంతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలే తమపై దాడి చేసినట్టు ఈడీ అధికారులు ఆరోపించారు. పెద్ద సంఖ్యలో కొందరు వ్యక్తులు ఈడీ అధికారులను చుట్టుముట్టి దాడి చేసినట్టు విజువల్స్ బయటకు వచ్చాయి. డిప్యూటీ డైరెక్టర్ స్థాయి ఈడీ అధికారి కారుపైన కూడా దాడి జరిగినట్టు అధికారులు తెలిపారు. ఈడీ అధికారులు భగేల్ తనయుడి నివాసంతో పాటు ఆయన సహచరుడు లక్ష్మీ నారాయణ్ బన్సాల్ అలియాస్ పప్పు బన్సాల్, తదితరుల నివాసాల్లో సోదాలు జరిపారు.


ఇవి కూడా చదవండి

Ranya Rao: రన్యారావుకు పొలిటికల్ లింక్స్.. దుమ్మెత్తి పోసుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్

Ranya Rao: ఇంటరాగేషన్‌లో టార్చర్.. కోర్టులో కంటతడి పెట్టిన రన్యారావు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 10 , 2025 | 08:58 PM