Share News

Ranya Rao: 34 కోట్ల రన్యారావ్‌ ఆస్తులు అటాచ్‌ చేసిన ఈడీ

ABN , Publish Date - Jul 05 , 2025 | 04:02 AM

బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యారావ్‌కు చెందిన రూ.34.12 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అటాచ్‌ చేసింది.

Ranya Rao: 34 కోట్ల రన్యారావ్‌ ఆస్తులు అటాచ్‌ చేసిన ఈడీ

బెంగళూరు, జూలై 4 (ఆంధ్రజ్యోతి): బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యారావ్‌కు చెందిన రూ.34.12 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అటాచ్‌ చేసింది. బెంగళూరు విక్టోరియా లే అవుట్‌లోని ఇల్లు, ఆర్కావతి లే అవుట్‌లో స్థలం, తుమకూరులో పారిశ్రామిక స్థలం, ఆనేకల్‌ తాలూకాలోని వ్యవసాయ భూమిని అటాచ్‌ చేశామని ఈడీ అధికారులు శుక్రవారం ప్రకటించారు.


దుబాయ్‌ నుంచి రూ.12.56 కోట్ల విలువైన బంగారాన్ని తెస్తూ.. ఈఏడాది మార్చి 3న కెంపేగౌడ విమానాశ్రయంలో రన్యారావ్‌ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో రన్యారావ్‌, రాజు, సాహిల్‌జైన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురూ పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 04:02 AM