Earthquake: ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు.. వరుసగా రెండోరోజు
ABN , Publish Date - Jul 11 , 2025 | 08:33 PM
శుక్రవారం సాయంత్రం 7.49 గంటలకు ఢిల్లీలో భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. భూమి నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్టు తెలిపింది. ఝజ్జార్ సమీపంలో భూకంపం రావడంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7 గా నమోదైంది. ఢిల్లీతో పాటు హరియాణాలోని పలు చోట్ల భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూమి కంపించడంతో వరుసగా ఇది రెండోరోజు కావడంతో జనం బెంబేలెత్తుతున్నారు. గురువారంనాడు కూడా ఢిల్లీలో 4.4 తీవ్రతో ప్రకంపనలు వచ్చాయి. నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, హర్యానాతో సహా పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది.
కాగా, శుక్రవారం సాయంత్రం 7.49 గంటలకు ఢిల్లీలో భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. భూమి నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్ర ఉన్నట్టు తెలిపింది. ఝజ్జార్ సమీపంలో భూకంపం రావడంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం చోటుచేసుకోలేదని అధికారులు చెబుతున్నారు.
బీహార్‌లో ఓట్ల చోరీకి కుట్ర.. ఈసీపై రాహుల్ విమర్శలు
భారత్‌కు నష్టం కలిగిందని ఒక్క ఫోటో చూపించండి.. అజిత్ డోభాల్ సవాల్
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి