Tejaswi Yadav: వేదికపై తేజస్వివైపు దూసుకువచ్చిన డ్రోన్
ABN , Publish Date - Jun 29 , 2025 | 08:08 PM
పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన 'సేవ్ వక్ఫ్, సేవ్ కానిస్టిట్యూషన్' ర్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ డ్రోన్‌ను సీజ్ చేశారు.

పాట్నా: ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) ఆదివారంనాడు ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు ఒక డ్రోన్ దూసుకువచ్చింది. తేజస్వి వెనక్కి జరగడంతో తృటిలో ప్రమాదం తప్పింది. డ్రోన్ వేదికపైనే పడిపోయింది. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన 'సేవ్ వక్ఫ్, సేవ్ కానిస్టిట్యూషన్' ర్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ డ్రోన్‌ను సీజ్ చేశారు.
ఈ ఘటనను పాట్నా ఎస్పీ (సెంట్రల్) ధ్రువీకరించారు. ఘటనను పరిశీలిస్తు్న్నామని, ఇది నిషేధిత ప్రాంతమని, డ్రోన్ల వంటి వస్తువులను ఎగరవేయరాదని చెప్పారు. ర్యాలీ జరుగుతుండటంతో జనసమూహాన్ని నియంత్రించే పనిలో పోలీసులు బిజీగా ఉని తెలిపారు. కచ్చితంగా దీనిపై దర్యాప్తు జరుపుతామని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
2026 ఏప్రిల్ 1 నుంచి ఇళ్ల లెక్కింపుతో జనాభా గణన షురూ
విమాన ప్రమాదం వెనుక కుట్ర కోణాన్ని తోసిపుచ్చలేం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి