Share News

viral accident footage: డ్రైవర్‌కు గుండె పోటు.. ఈ కారు ఎలా దూసుకెళ్లిందో చూడండి..

ABN , Publish Date - Nov 22 , 2025 | 06:43 PM

మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును నడుపుతున్న డ్రైవర్‌కు హఠాత్తుగా గుండె పోటు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నియంత్రణ కోల్పోయిన కారు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాల పైకి దూసుకెళ్లింది. అనంతరం బ్రిడ్జ్‌ను కూడా ఢీకొట్టింది.

viral accident footage: డ్రైవర్‌కు గుండె పోటు.. ఈ కారు ఎలా దూసుకెళ్లిందో చూడండి..
viral accident footage

మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును నడుపుతున్న డ్రైవర్‌కు హఠాత్తుగా గుండె పోటు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నియంత్రణ కోల్పోయిన కారు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాల పైకి దూసుకెళ్లింది. అనంతరం బ్రిడ్జ్‌ను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (driver heart attack video).


ఠాణె జిల్లాలోని అంబర్‌నాథ్ ఫ్లై ఓవర్‌పై శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శివసేన పార్టీకి చెందిన స్థానిక నేత కిరణ్ చాబే ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకుని తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో కారు డ్రైవర్ లక్ష్మణ్ షిండే‌కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆ కారు బ్యాలెన్స్ కోల్పోయి ఎదురుగా వస్తున్న బైక్‌లు, ఇతర వాహనాల పైకి దూసుకెళ్లింది. కారు ఢీకొట్టడంతో ఒక వ్యక్తి బైక్‌తో పాటు ఫ్లై ఓవర్ మీద నుంచి ఎగిరి కిందపడ్డాడు (heart attack while driving).


ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ షిండేతో పాటు మరో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు (shocking road incident). మరికొందరు గాయాలపాలయ్యారు. కారులో ఉన్న శివసే నేత కిరణ్‌ను స్థానికులు బయటకు తీసి హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు సమాచారం. ఆ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి..

హిందువులు ఉనికి కోల్పోతే ప్రపంచానికే ఉనికి ఉండదు.. మోహన్ భాగవత్

తేజస్ ప్రమాదం.. ఇంతకీ ఎవరీ నమాన్ష్..

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Nov 22 , 2025 | 06:43 PM