Share News

DMDK Premalatha: అసెంబ్లీ ఎన్నికల్లో మెగా కూటమి ఏర్పాటు

ABN , Publish Date - Nov 14 , 2025 | 01:22 PM

వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మెగా కూటమి ఏర్పాటు చేస్తానని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత ప్రకటించారు. కోయంబేడులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన జిల్లా నేతల సమావేశంలో ఆమె ప్రసంగించారు.

DMDK Premalatha: అసెంబ్లీ ఎన్నికల్లో మెగా కూటమి ఏర్పాటు

- డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత

చెన్నై: వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మెగా కూటమి ఏర్పాటు చేస్తానని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత(Premalatha) ప్రకటించారు. కోయంబేడులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన జిల్లా నేతల సమావేశంలో ఆమె ప్రసంగించారు. అన్ని పార్టీలకంటే ముందుగా తమ పార్టీ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించిందని, తన పర్యటనకు లక్షలాదిమంది ప్రజలు హాజరువుతుండటంతో ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామనే నమ్మకం కలుగుతోందన్నారు.


nani3,2.jpg

రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకే(DMK, AIADMK) పార్టీల తర్వాత బలమైన మూడో పార్టీగా డీఎండీకే ఉందని, ఏయే పార్టీలను కలుపుకుని కూటమి ఏర్పాటు చేయాలనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. డిసెంబర్‌ 28న కెప్టెన్‌ ద్వితీయ గురుపూజ నిర్వహించనున్నామని తెలిపారు. సమావేశంలో 84మంది జిల్లా శాఖ కార్యదర్శులకుగాను 74 మంది హాజరయ్యారు. డీఎండీకే ప్రిసీడియం చైర్మన్‌ డాక్టర్‌ ఇలంగోవన్‌, కోశాధికారి ఎల్కే సుదీష్‌, ప్రధాన కార్యాలయం కార్యదర్శి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ పెరిగిన ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

భరత్‌రామ్‌ నుంచి ప్రాణహాని ఉంది

Read Latest Telangana News and National News

Updated Date - Nov 14 , 2025 | 01:22 PM