RJD president: అక్కడంతా నియంతృత్వం, బంధుప్రీతి
ABN , Publish Date - Jun 25 , 2025 | 03:36 PM
ఆర్జేడీకు 13వ సారి జాతీయ అధ్యక్షుడిగా లాలూ ప్రసాద్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. దీనిపై లోక్ జనశక్తి పార్టీ ఎంపీ అరుణ్ భారతి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది నియంతృత్వం, బంధుప్రీతికి ప్రత్యక్ష సాక్ష్యమని..

పాట్నా (బీహార్) జూన్ 25: ఆర్జేడీ(రాష్ట్రీయ జనతాదల్)కు 13వ సారి జాతీయ అధ్యక్షుడిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఇవాళ తన నామినేషన్ దాఖలు చేశారు. దీనిపై LJP(లోక్ జనశక్తి పార్టీ) ఎంపీ అరుణ్ భారతి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది ఆర్జేడీలో నియంతృత్వం, బంధుప్రీతికి ప్రత్యక్ష సాక్ష్యమని ఆయన అన్నారు. RJDలోని అంతర్గత ప్రజాస్వామ్యంపై ఆయన మాటల తూటాలు సంధించారు. పార్టీలో నియంతృత్వం, బంధుప్రీతి పాతుకుపోయిందని విమర్శించారు.
ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ అనేక సందర్భల్లో ఆర్జేడీలో అంతర్గత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటాడని, ఆర్జేడీలో బంధుప్రీతికి దీని కంటే గొప్ప ఉదాహరణ మరొకటి లేదని ఎంపీ అరుణ్ భారతి అన్నారు. బాబా సాహెబ్ చిత్రాన్ని లాలూ పాదాల దగ్గర ఉంచినప్పుడు, అతని ఆరోగ్యం బాగాలేదని చెప్పుకొచ్చారని, కానీ నామినేషన్ సమయంలో మాత్రం, లాలూ ఆరోగ్యం బాగానే ఉందని భారతి ఎద్దేవా చేశారు.
కాగా, అంతకుముందు, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నాయకుడు తేజశ్వి యాదవ్ నిన్న తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన తర్వాత 'పేదల దూత' అని అభివర్ణించారు. లాలూ ప్రసాద్ యాదవ్ 13వ సారి అధ్యక్షుడుగా ఉండటం పట్ల పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో తన తండ్రి నాయకత్వంలో పార్టీ విజయాన్ని రుచి చూస్తుందని ఆశిస్తున్నానని యాదవ్ అన్నారు.
అంతేకాదు, 'పేదల దూత లాలూ జీ నేడు ఆర్జేడీ జాతీయ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ప్రజలలో అపారమైన ఆనందం ఉంది. లాలూ జీ నామినేషన్ పట్ల పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఇతరులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆయన 12 పదవీకాలాలను పూర్తి చేసుకున్నారు. ఇది ఆయన 13వ పదవీకాలం అవుతుంది. మేమందరం సంతోషంగా ఉన్నాము. రాబోయే కాలంలో లాలూ జీ నాయకత్వంలో మనం విజయం రుచి చూస్తామని మేము నమ్ముతున్నాము' అని బీహార్ మాజీ డిప్యూటీ సీఎం అయిన తేజస్వి అన్నారు.
ఇలా ఉండగా, ఆర్జేడీ తన జాతీయ మండలి, రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలను నిర్వహిస్తోంది. ఈ సంస్థాగత ఎన్నికలకు జూలై 5న పోలింగ్ జరుగుతుంది. దీంతో లాలూ 13వ సారి పార్టీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. పాత జనతాదళ్‌లో చీలిక తర్వాత 1997లో ఆర్జేడీ పార్టీ ఏర్పడినప్పటి నుండి లాలు ప్రసాద్ యాదవ్ 28 సంవత్సరాలుగా ఆర్జేడీ చీఫ్‌గా ఉన్నారు. అయితే, ఈ ఏడాది ఆ పార్టీకి అత్యంత కీలకం. ఎందుకంటే, ఈ సంవత్సరం బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఇవీ చదవండి:
జూన్ 25 నుంచి 30 వరకు వర్షాలు.. ఏ ప్రాంతాల్లో ఉన్నాయో తెలుసా..
ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి