NEP, Language Row: విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం.. డీఎంకేపై ధర్మేంద్ర ప్రధాన్ ఎదురుదాడి
ABN , Publish Date - Mar 10 , 2025 | 02:44 PM
బడ్జెట్ సమావేశాల సెకెండ్ సెషన్ సోమవారంనాడు ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాల సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ డీఎంకే వైఖరిపై విరుచుకుపడటంతో పార్లమెంటులో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. డీఎంకే ఎంపీలు నిరసనకు దిగడంతో 30 నిమిషాల పాటు సభ వాయిదా పడింది.

న్యూఢిల్లీ: నూతన విద్యా విధానం (NEP), తిభాషా విధానంపై డీఎంకే వైఖరిని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) లోక్‌సభలో తప్పుపట్టారు. తమిళనాడు విద్యార్థుల సంక్షేమం పట్ల డీఎంకే (DMK)కు నిజాయితీ లోపించిందని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును వారు నాశనం చేస్తున్నారని అన్నారు.
Railway Ticket Transfer: మీ రైల్వే టికెట్ మీ ఫ్యామిలీకి ఇలా ట్రాన్స్ఫర్ ..స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
''భాషాపరమైన అవరోధాలు కల్పించడం ఒక్కటే వారి పని. వాళ్లు రాజకీయాలు చేస్తున్నారు. రాద్ధాంతం చేస్తున్నారు. అది అప్రజాస్వామికం, అనాగరికం" అని మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతీయ విద్యా విధానంతో కేంద్రం హిందీ భాషను బలవంతంగా బలవంతంగా రుద్దుతోందని డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై కేంద్రం, తమిళనాడు మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో మంత్రి తాజా వ్యాఖ్యలు చేశారు.
ప్రశ్నోత్తరాల సమయంలో రగడ
బడ్జెట్ సమావేశాల సెకెండ్ సెషన్ సోమవారంనాడు ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాల సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ డీఎంకే వైఖరిపై విరుచుకుపడటంతో పార్లమెంటులో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. డీఎంకే ఎంపీలు నిరసనకు దిగడంతో 30 నిమిషాల పాటు సభ వాయిదా పడింది. PM SHRI పథకంపై అడిగిన ఒక ప్రశ్నకు.. తమిళనాడు ప్రభుత్వం రెండునాల్కల ధోరణితో వ్యవహిస్తోందని మంత్రి తప్పుపట్టారు. ఎంఓయూపై సంతకం చేసేందుకు మొదటి అంగీకరించిన తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడు వైఖరి మార్చుకుందన్నారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ సహా పలు బీజేపీయేతర రాష్ట్రాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయన్నారు.
రాజ్యసభలో డీఎంకే వాకౌట్
మరోవైపు, రాజ్యసభలో త్రిభాష విధానం, డీలిమిటేషన్ అంశాలను డీఎంకే లేవనెత్తింది. అనంతరం సభ నుంచి సభ్యులు వాకౌట్ చేశారు. ఈ అంశంపై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చెలరేగింది. విపక్షం వాకౌట్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా విమర్సలు గుప్పించారు. విపక్షాలు వాయిదా తీర్మానానికి ముందు నిబంధనలను చదువుకోవాలన్నారు. వాళ్లు ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహిరిస్తున్నారనీ, ఎల్ఓపీ సహా విపక్ష నేతలు రిఫ్రషింగ్ కోర్సుకు వెళ్లి నియమ నిబంధనలను అవగాహన చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజూ విపక్ష సభ్యులు వాయిదా తీర్మానం ఇస్తుండటం పార్లమెంటరీ వ్యవస్థ ప్రతిష్ఠను తగ్గించడమేనని విమర్శించారు. నిబంధనల కింద ప్రతి అంశాన్ని చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
ఇవి కూడా చదవండి
Digvijaya Singh: బీజేపీ కోవర్టులను ఎప్పుడు తప్పిస్తారు?.. రాహుల్‌కు డిగ్గీ ప్రశ్న
Ramdev Baba: అమెరికా 'టారిఫ్ టెర్రరిజం'... రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.