Share News

RSS Chief Strong Statement: కేటుగాళ్లకు స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిన మోహన్ భగవత్

ABN , Publish Date - Apr 26 , 2025 | 07:26 PM

'దౌర్జన్యాలకు పాల్పడే వారికి గుణపాఠం నేర్పడం మన కర్తవ్యం'.. 'మీరు శక్తివంతులైతే, అవసరమైనప్పుడు దానిని చూపించాలి'.. 'మా హృదయాల్లో బాధ ఉంది. మేము కోపంగా ఉన్నాము.'

RSS Chief Strong Statement: కేటుగాళ్లకు స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిన మోహన్ భగవత్
RSS Chief Mohan Bhagwat

RSS Chief Strong Statement: పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. అన్నింటికంటే ముందు.. మనం మన పొరుగువారికి హాని చేయమని ఆయన అన్నారు. దీని తరువాత కూడా, ఎవరైనా తప్పుడు మార్గాన్ని అవలంబిస్తే, రాజు తన ప్రజలను రక్షించాలి అని ఆయన తెలిపారు. పహల్గాం ఉగ్రవాద దాడిపై స్పందించిన మోహన్ భగవత్.. 'దౌర్జన్యాలు చేసే వారికి గుణపాఠం నేర్పడం మా మతం' ఇది హిందూ మతం అని చెప్పారు. ఇవాళ భగవత్ ఢిల్లీలో హిందూ మేనిఫెస్టో అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పహల్గాం ఉదంతంపై స్పందించారు.

Untitled-34.jpg

ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో పాకిస్తాన్‌పై ఆగ్రహ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదానికి సంబంధించి పొరుగు దేశం(పాకిస్థాన్)పై భారతదేశం చర్య ప్రారంభించింది. ఈ విషయంపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఒక ప్రకటన చేశారు. దారుణాలకు పాల్పడే వారికి గుణపాఠం నేర్పడం మన కర్తవ్యమన్నారు.

"రావణుని సంక్షేమం కోసమే చంపారు.. దేవుడే అతన్ని చంపాడు. ఇది హింస కాదు, అహింస. అహింస మన మతం.. దురాగతాలు చేసేవారిని ఎంతో కాలం మన్నించలేం. మనం మన పొరుగువారికి ఎప్పుడూ హాని చేయకూడదు. దీని తర్వాత కూడా, ఎవరైనా తప్పుడు మార్గాన్ని అవలంబిస్తే, ప్రజలను రక్షించడం రాజు విధి. రాజు తన పని తాను చేసుకుంటాడు" అని ఆయన అన్నారు.

'ధర్మానికి, అధర్మానికి మధ్య పోరాటం'

"ఈ దాడి ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటం అని గుర్తు చేస్తోంది. ప్రజలను వారి మతం గురించి అడిగి చంపేశారు. హిందువులు ఎప్పటికీ ఇలా చేయరు. ఇది మా స్వభావం కాదు. ద్వేషం, శత్రుత్వం మన సంస్కృతిలో లేవు, నష్టాలను నిశ్శబ్దంగా భరించడం కూడా మా సంస్కృతిలో లేదు. మా హృదయాల్లో బాధ ఉంది. మేము కోపంగా ఉన్నాము. చెడును అంతం చేయడానికి మన బలాన్ని చూపించాలి" అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ అన్నారు.

"రావణుడు తన మనసు మార్చుకోవడానికి నిరాకరించినందున అతన్ని కూడా చంపారు. వేరే మార్గం లేదు. రాముడు అతన్ని చంపాడు కానీ అతనికి సంస్కరించుకునే అవకాశం కూడా ఇచ్చాడు. అతను సన్మార్గంలోని రావడానికి ఇష్టం చూపించకపోయినప్పుడే అతన్ని చంపారు" అని ఆయన అన్నారు.

'మీరు శక్తివంతులైతే, అవసరమైనప్పుడు శక్తిని చూపించాలి'

"మేము బలమైన ప్రతిస్పందనను ఆశిస్తున్నాము. నిజంగా అహింసాయుత వ్యక్తి కూడా బలంగా ఉండాలి. బలం లేకపోతే వేరే మార్గం లేదు. కానీ బలం ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు అది కనిపించాలి" అని మోహన్ భగవత్ అన్నారు.


ఇవి కూడా చదవండి

Rahul Gandhi: భారత్ సమ్మిట్‌లో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Shruti Haasan: పాపం శృతి హాసన్.. సీఎస్‌కే ఓటమిని తట్టుకోలేకపోయింది..

Updated Date - Apr 26 , 2025 | 08:22 PM