Pollution Control: ఢిల్లీలో పాత వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్
ABN , Publish Date - Jun 22 , 2025 | 06:20 AM
ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఈ నిబంధన ప్రకారం పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలకు..

న్యూఢిల్లీ, జూన్ 21: ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఈ నిబంధన ప్రకారం పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలకు, పదిహేనేళ్లు దాటిన పెట్రోల్ వాహనాలకు జూలై 1 నుంచి ఇంధనం పోయరు.
ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరై ఇక్కడ తిరిగే వాహనాలకు కూడా ఇది వర్తిస్తుందని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (సీఏక్యూఎమ్) సభ్యుడు వీరేంందర్ శర్మ తెలిపారు. ఈ కొత్త నిబంధనను అమలు చేయడానికి ఢిల్లీలోని దాదాపు అన్ని పెట్రోల్ బంకుల్లో ఇప్పటికే ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్(ఏఎన్‌పీఆర్) కెమెరాలను అమర్చారు.