Delhi Blast: మృతులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా
ABN , Publish Date - Nov 11 , 2025 | 09:25 PM
పేలుడులో గాయపడి లోక్‌నాయక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం రేఖాగుప్తా మంగళవారంనాడు పరామర్శించారు. వారికి అన్నివిధాలా అండగా ఉంటామని తెలిపారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ పేలుళ్ల (Delhi Blast) ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ముఖ్యమంత్రి రేఖాగుప్తా (Rakha Gupta) రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఎర్ర కోట సమీపంలోని జరిగిన పేలుళ్ల ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు క్షతగాత్రులయ్యారు. ఈ ప్రమాదంలో శాశ్వత వైకల్యం పొందిన బాధితులకు ముఖ్యమంత్రి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.2 లక్షల సాయం అందిస్తామని చెప్పారు. క్షతగాత్రులకు పూర్తి నాణ్యతాయుతైన వైద్య చికిత్స అందిస్తామని భరోసా ఇచ్చారు.
పేలుడులో గాయపడి లోక్‌నాయక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రేఖాగుప్తా మంగళవారంనాడు పరామర్శించారు. వారికి అన్నివిధాలా అండగా ఉంటామని తెలిపారు. దీనికి ముందు ఢిల్లీ ఘటనపై సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో సీఎం ఆవేదన వ్యక్తం చేసారు. 'ఈ దురదృష్టకర ఘటనతో ఢిల్లీ సిటీ మొత్తం షాక్‌కు గురయింది. ఈ కష్టకాలంలో తమ సొంతవారిని కోల్పోయిన కుటుంబాలు, క్షతగాత్రులకు సంతాపం తెలియజేస్తున్నాను. వారికి అండగా నిలుస్తాం' అని సీఎం ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ పేలుళ్లు.. నిధులు సమీకరణలో కీలకంగా మహిళా డాక్టర్
ఢిల్లీ పేలుళ్ల ఘటన.. కీలక వ్యక్తి ఫొటో వెలుగులోకి..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి