Share News

Delhi Blast: ముంబై చేరిన ఢిల్లీ బ్లాస్ట్ దర్యాప్తు.. ముగ్గురు అనుమానితుల అరెస్టు

ABN , Publish Date - Nov 18 , 2025 | 06:05 PM

ముంబై పోలీసుల సాయం తీసుకుని దర్యాప్తు సంస్థలు ఆ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. నిర్బంధంలోకి తీసుకున్న అనుమానితులను తదుపరి విచారణ కోసం ఢిల్లీకి తరలించినట్టు తెలుస్తోంది.

Delhi Blast: ముంబై చేరిన ఢిల్లీ బ్లాస్ట్ దర్యాప్తు.. ముగ్గురు అనుమానితుల అరెస్టు
Delhi blasts

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన పేలుడు ఘటనలో 15 మంది మృతిచెందిన ఘటనపై విచారణ తాజాగా ముంబైకి చేరింది. ఈ ఘటనకు సంబంధించిన మూలాలు వివిధ రాష్ట్రాల్లో కనిపించడంతో సోదాలు, అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా సోషల్ మీడియా, ఇతర డిటిజల్ మాధ్యమాల ద్వారా ఈ కేసుతో సంబంధం కలిగిన వ్యక్తులను కనిపెట్టడంపై కేంద్ర ఏజెన్సీలు దృష్టిసారించినట్టు ముంబై పోలీసు వర్గాలు తెలిపాయి.


ముంబైలోని వివిధ ప్రాంతాల్లో కేంద్ర ఏజెన్సీలు తాజాగా చేపట్టిన కోవర్ట్ ఆపరేషన్‌లో ముగ్గురు అనుమానితులను నిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ ముగ్గురూ విద్యాధికులే కాకుండా ఉన్నత కుటుంబాల నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. ముంబై పోలీసుల సాయం తీసుకుని దర్యాప్తు సంస్థలు ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. నిర్బంధంలోకి తీసుకున్న అనుమానితులను తదుపరి విచారణ కోసం ఢిల్లీకి తరలించినట్టు తెలుస్తోంది.


కాగా, ఈ కేసులో నిర్బంధంలోకి తీసుకున్న అనుమానితులు ప్రధాన నిందితుడితో ఒక నిర్దిష్ట మొబైల్ అప్లికేషన్‌ ద్వారా సంప్రదింపులు సాగించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నారు. కీలకమైన సమాచారాన్ని పంచుకునేందుకు వారు ఆ యాప్ వాడినట్టు అనుమానిస్తున్నారు. విచారణలో వెలుగుచూస్తున్న సమాచారం ఆధారంగా మహారాష్ట్రలోని వివిధ జిల్లాల్లో తుదుపరి గాలింపు చర్యలు ఉంటాయని చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి..

మోదీ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది.. మళ్లీ శిశథరూర్ ప్రశంసలు

ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌లో కీలక సమాచారం.. కోడ్‌వర్డ్‌లుగా బిర్యానీ, దావత్

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Nov 18 , 2025 | 06:06 PM