Delhi Blast: దీపావళికి ప్లాన్ చేసి.. ఆపై విరమించుకుని...
ABN , Publish Date - Nov 12 , 2025 | 11:20 AM
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుళ్ల ఘటనకు సంబంధించి నిందితుడు ముజామ్మిల్ కీలక విషయాన్ని బయటపెట్టాడు. నిజానికి తాము దీపావళికే ప్లాన్ చేశామని, కానీ అమలు చేయడంలో విఫలమైనట్టు అతడు విచారణలో చెప్పాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ పేలుళ్ల కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు దీపావళికే ఈ దాడికి ప్లాన్ చేశారని, కానీ తర్వాత దానిని రద్దు చేసుకున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో 12 మంది మృతిచెందారు. అయితే.. అంతకముందే ఉమర్‌తో పాటు తానూ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కీలక నిందితుడు ముజామ్మిల్ దర్యాప్తు అధికారులకు తెలిపాడు.
జనవరిలో మరో దాడికీ ప్లాన్.!
వాస్తవానికి దీపావళికే ఢిల్లీలో రద్దీగా ఉండే ప్రదేశంలో దాడి చేసేందుకు ముజామ్మిల్ టీమ్ ప్రణాళికలు రచించిందని, అయితే దానిని అమలు చేయడంలో విఫలమైనట్టు ముజామ్మిల్ చెప్పాడని అధికారులు తెలిపారు. నిందితులు వచ్చే ఏడాది జనవరి 26న కూడా మరో దాడికి ప్లాన్ చేశారని, దానికి ఎర్రకోట చుట్టుపక్కల ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్టు విచారణలో తేలింది. దర్యాప్తులో భాగంగా ముజామ్మిల్ ఫోన్ డేటా ద్వారా మరింత సమాచారాన్ని సేకరించినట్టు అధికారులు వెల్లడించారు.
దేశ రాజధానిలోని లాల్‌ఖిలా సమీపంలో జరిగిన ఈ పేలుడు ఘటన దేశాన్ని కుదిపేసింది. భద్రతా వ్యవస్థలో ప్రమాద ఘంటికలు మోగించింది. ఘటన తర్వాత ముజామ్మిల్ అనే వైద్యుణ్ని పట్టుకున్న పోలీసులు.. అతడిపై విచారణ చేపట్టారు. ఫరిదాబాద్‌లోని ఆల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో ముజామ్మిల్ సహోద్యోగి అయిన ఉమర్, ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ సమీపంలో కారు పేలి మరణించినట్టు అధికారులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి:
ఢిల్లీ పేలుళ్లు.. నిధులు సమీకరణలో కీలకంగా మహిళా డాక్టర్
జైష్ ఉగ్రమూకలకు మహిళా డాక్టర్ నాయకత్వం.. ఫరీదాబాద్ ఉగ్రకుట్ర కేసులో కీలక విషయాలు