Share News

Deepika Padukone International Recognition: దీపికా సరికొత్త రికార్డ్.. అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత

ABN , Publish Date - Jul 03 , 2025 | 11:11 AM

Deepika Padukone: హాలీవుడ్ నటుల సరసన దీపికా పేరు ఉండటం గర్వించదగ్గ విషయం. అంతేకాకుండా ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి భారతీయ నటిగా దీపికా రికార్డు సృష్టించారు.

Deepika Padukone International Recognition: దీపికా సరికొత్త రికార్డ్.. అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత
Deepika Padukone

ముంబై, జులై 2: ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణెకు (Deepika Padukone) ఇంటర్నేషనల్ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. ‘హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌ స్టార్‌ 2026’కు (Hollywood Walk of Fame Star 2026) దీపికా ఎంపికయ్యారు. మోషన్‌ పిక్చర్స్‌ విభాగంలో బాలీవుడ్ నటికి ఈ గౌరవం దక్కింది. హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌ స్టార్‌ 2026‌కు మొత్తం 35 మంది ప్రతిభావంతులను ఈ ఛాంబర్ ఎంపిక చేసింది. ఎంటర్‌టైన్‌మెంట్‌లో విశేషమైన కృషి చేసినందుకు గాను వీరిని ఎంపిక చేసినట్లు ఛాంబర్ వెల్లడించింది. ఈ జాబితాలో డెమి మూర్‌, రాచెల్‌ మెక్‌ఆడమ్స్‌, ఎమిలీ బ్లంట్‌ వంటి హాలీవుడ్ స్టార్స్ ఉన్నారు. హాలీవుడ్ నటుల సరసన దీపికా పేరు ఉండటం గర్వించదగ్గ విషయం. అంతేకాకుండా ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి భారతీయ నటిగా దీపికా రికార్డు సృష్టించారు.


2006లో ఇండస్ట్రీకి వచ్చిన దీపిక.. 2007లో వచ్చిన ఓం శాంతి ఓం చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అప్పటి నుంచి ఎన్నో సినిమాల్లో నటిస్తూ.. భారీ విజయాలను అందుకోవడంతో పాటు తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు దీపికా. ఇక 2017లో ‘త్రిబుల్‌ ఎక్స్‌: ది రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌’తో హాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ భామ అక్కడి ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్‌లో అగ్రతారలకు సైతం దక్కని ఈ అరుదైన గౌరవం దీపికా పదుకొణె దక్కించుకున్నారు.

Updated Date - Jul 03 , 2025 | 11:59 AM