Share News

Legal Issues: నటి రమ్యపై దర్శన్‌ ఫ్యాన్స్‌ అసభ్య పోస్టులు

ABN , Publish Date - Jul 29 , 2025 | 04:54 AM

కన్నడ సినీనటి, మాజీ ఎంపీ రమ్యకు వ్యతిరేకంగా నటుడు దర్శన్‌ అభిమానులు అసభ్య మెసేజ్‌లు పోస్టు చేశారు..

Legal Issues: నటి రమ్యపై దర్శన్‌ ఫ్యాన్స్‌ అసభ్య పోస్టులు

బెంగళూరు, జూలై 28(ఆంధ్రజ్యోతి): కన్నడ సినీనటి, మాజీ ఎంపీ రమ్యకు వ్యతిరేకంగా నటుడు దర్శన్‌ అభిమానులు అసభ్య మెసేజ్‌లు పోస్టు చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నాగలక్ష్మి చౌదరి...విచారించి చర్యలు తీసుకోవాలని బెంగళూరు నగర పోలీస్‌ కమిషనర్‌కు లేఖ రాశారు. దర్శన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ సందర్భంగా ‘హైకోర్టు చేసిన తప్పిదాలను మేము చేయబోము. దర్శన్‌కు ఎలా బెయిల్‌ ఇచ్చారు..?’ అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను కోట్‌ చేస్తూ, ‘సామాన్య కుటుంబానికి న్యాయం జరగనుంది’ అని రమ్య పోస్టు చేశారు. దీంతో ఆగ్రహించిన దర్శన్‌ అభిమానులు, ఆమెకు వ్యతిరేకంగా అసభ్యకర పోస్టులు పెట్టారు. కాగా, ఈ వ్యవహారంపై నటి రమ్య ఫిర్యాదు చేస్తే తగిన చర్య


ఇవి కూడా చదవండి..

22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్

పహల్గాం దాడికి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్

For More National News and Telugu News..

Updated Date - Jul 29 , 2025 | 04:54 AM