Danish Kaneria: ఉగ్రవాదులు దేశభక్తులా
ABN , Publish Date - Apr 26 , 2025 | 03:03 AM
పాక్ ఉపప్రధాని ఉగ్రవాదులను దేశభక్తులుగా పొగడటాన్ని మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా తీవ్రంగా తప్పుబట్టారు, ఇలాంటి వ్యాఖ్యలు ప్రభుత్వమే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదన్న ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయని అన్నారు

పాక్ ఉపప్రధానిని ప్రశ్నించిన క్రికెటర్ కనేరియా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: పహల్‌గామ్‌లో దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులు దేశభక్తులని పాక్ ఉప ప్రధాని ఇషాక్ దర్ ప్రశంసించడాన్ని ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా తప్పుపట్టారు. ఆయన ఎక్స్‌లో పోస్టు పెడుతూ ఉగ్రవాదులను దేశభక్తులనడం అవమానకరమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వమే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్న వాదనను బహిరంగంగా అంగీకరించినట్టయిందని పేర్కొన్నారు.