Share News

Rahul Citizenship: రాహుల్‌ పౌరసత్వం పిటిషన్‌ రద్దు

ABN , Publish Date - May 06 , 2025 | 04:29 AM

రాహుల్‌ గాంధీ బ్రిటన్‌ పౌరుడని ఆరోపిస్తూ దాఖలైన పౌరసత్వ పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్‌కు వేరే న్యాయ మార్గం అనుసరించమని సూచించింది

Rahul Citizenship: రాహుల్‌ పౌరసత్వం పిటిషన్‌ రద్దు

లఖ్‌నవూ, మే 5: కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ పౌరసత్వాన్ని సవాల్‌చేసిన పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు కొట్టివేసింది. వేరే న్యాయ మార్గంలో కోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. ఈ పిటిషన్‌ను కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త ఎస్‌ విఘ్నేశ్‌ శిశిర్‌ దాఖలుచేశారు. రాహుల్‌ బ్రిటన్‌ పౌరుడు అని నిరూపించే పత్రాలు, బ్రిటిష్‌ ప్రభుత్వం నడిపిన కొన్ని మెయిల్‌ సందేశాలు తన వద్ద ఉన్నాయని పిటిషనర్‌ వాదించారు. రాహుల్‌ ద్విపౌరసత్వం కలిగి ఉన్న కారణంగా లోక్‌సభలో ప్రతిపక్షనేతగానూ, ఎన్నికల్లో అభ్యర్థిగానూ ఆయన అనర్హుడని వాదించారు. ఆయన లోక్‌సభ సభ్యాత్వాన్ని రద్దు చేయాలని కోరారు.


పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలను బ్రిటిష్‌ ప్రభుత్వం దృష్టికి కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లిందని గత నెల 21వ తేదీన జరిపిన విచారణలో పిటిషనర్‌కు కోర్టు తెలిపింది. మే 5(సోమవారం) లోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఇప్పటికే ఆదేశించింది. కేంద్రం తరఫున కోర్టుకు డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ పాండే హాజరయ్యారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవడానికి మరింత గడువు అవసరమని అభ్యర్థించారు. దీంతో కోర్టు పిటిషన్‌ను కొట్టేసింది.


Read Also: Rahul meets PM Modi : ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్‌ గాంధీ భేటీ

Sonu Nigam: పహల్గాం ఘటనపై సోనూ నిగమ్‌ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..

India vs Pakistan Missile Power: భారత్‌తో పోలిస్తే పాక్ క్షిపణుల సామర్థ్యం ఎంతంటే..

Updated Date - May 06 , 2025 | 04:29 AM