PDA At Metro Station: మీ కక్కుర్తి తగలెయ్య.. పబ్లిక్‌లో ఇదేం పని..
ABN , Publish Date - Apr 12 , 2025 | 07:46 AM
కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు వ్యక్తులు తాము ఎక్కడ ఉన్నాం అనే సోయి కూడా లేకుండా పబ్లిక్‌గానే రెచ్చిపోతున్నారు. చుట్టూ ఉన్న వాళ్లు వీరిని చూసి తలదించుకుంటున్నారు తప్ప.. ఈ కామాంధులు మాత్రం అస్సలు భయపడటం లేదు. తాజాగా ఓ జంట మెట్రో స్టేషన్‌లో అసభ్యపనులకు పాల్పడ్డారు. ఆ వివరాలు..

బెంగళూరు: ఒకప్పుడు అబ్బాయిలు.. నలుగురిలో అమ్మాయితో మాట్లాడాలి అంటే భయపడేవారు. ఇక ఆడపిల్లలు అయితే.. కనీసం తల ఎత్తి చూసే వారు కూడా కాదు. కానీ ప్రస్తుతం.. ఎవరీ ఇష్టం వారిది.. మధ్యలో మనం ఎందుకు కల్పించుకోవాలి అనే ధోరణి పెరిగిపోవడంతో.. కొందరు పబ్లిక్‌లో చేయకూడని పనులు చేస్తూ.. మిగతా వారికి ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇక ఇలాంటి చెత్త పనులకు మెట్రో రైళ్లు, స్టేషన్‌లు వేదికలు అవుతుండటం గమనార్హం. వీటిల్లో చిన్నారులు, మహిళలు, కుటుంబాలు ప్రయాణం చేస్తుంటారు. వారికి ఇబ్బంది కలిగించే పనులు చేస్తున్నారు కొందరు. మరీ ముఖ్యంగా మెట్రో రైల్లోనే అసభ్యకార్యక్రమాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
తమ చుట్టూ ప్రయాణికులు ఉన్నారనే సంగతి కూడా మర్చిపోయి మరీ రెచ్చిపోతున్నారు కామాంధులు. గతంలో ఢిల్లీ మెట్రోలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు ఆ ట్రెండ్ బెంగళూరుకు కూడా పాకింది. ఓ జంట మెట్రో స్టేషన్‌లో అసభ్యకరంగా ప్రవర్తించారు. పబ్లిక్‌లో ఉన్నామనే విషయం మర్చిపోయి మరీ రెచ్చిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. వీరిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆ వివరాలు..
ఈ సంఘటన బెంగళూరు మెట్రో స్టేషన్‌లో వెలుగులోకి వచ్చింది. ఓ జంట.. మాదవర మెట్రో స్టేషన్‌లో.. ప్రయాణికుల ఎదురుగానే అసభ్యకరంగా ప్రవర్తించారు. శుక్రవారం నాడు ఈ ఘటన జరిగింది. మెట్రో స్టేషన్‌లో ఉన్న కొందరు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. బెంగళూరు మెట్రో కూడా ఢిల్లీ కల్చర్‌ను అనుసరిస్తుందా అనే క్యాప్షన్‌తో వీడియోని షేర్ చేశారు. లవర్స్ మెట్రో రైలు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్ టీషర్ట్‌లో చేయి దూర్చి.. అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇతర ప్రయాణికుల ఎదురుగానే వారు ఇంతటి దరిద్రానికి పాల్పడ్డారు.
వీడియో చూసిన నెటిజనులు మండిపడుతున్నారు. మీకు మరీ ఇంత కక్కుర్తి ఎంట్రా అయ్యా.. అది పబ్లిక్ మెట్రో.. ఇలాంటి పనులు చేసుకోవాలనుకుంటే.. మీ ఇళ్లకు వెళ్లండి.. చిన్నపిల్లలు, మహిళలు, పెద్ద వారు ఉంటారనే సోయి కూడా లేదా.. చిత్తకార్తి కుక్కలా ప్రవర్తిస్తున్నారు.. ఇలాంటి దిక్కుమాలిన పనులు బెంగుళూరులోనే కనిపిస్తాయి.. హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో కనిపించవు ఎందుకు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు. అయితే వీడియోని చూసిన కొందరు అభ్యంతరకరంగా ఉంది.. పిల్లలు కూడా చూసే అవకాశం ఉంది.. కనుక దాన్ని తొలగించమని కోరడంతో.. వీడియోని పోస్ట్ చేసిన వ్యక్తి దాన్ని ట్విట్టర్ నుంచి తొలగించారు.
ఇవి కూడా చదవండి:
Ram Charan: రిలయన్స్ కాంపా బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్ చరణ్
Hyderabad: చదివింది బీఎస్సీ.. చేసేది స్మగ్లింగ్